- Telugu News Photo Gallery Cinema photos Tollywood Actress Abhinaya Shares Her Wedding Photos In Social Media
Abhinaya Wedding: పెళ్లి ఫోటోస్ షేర్ చేసిన నటి అభినయ.. కొత్త జంట ఎంత ముద్దుగా ఉన్నారో చూశారా.. ?
సౌత్ ఇండస్ట్రీలో నటి అభినయకు మంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో ఎన్నో చిత్రాల్లో కీలకపాత్రలు పోషించింది. ఎలాంటి పాత్రలోనైనా అద్భుతమైన నటనతో అడియన్స్ హృదయాలను గెలుచుకుంది. తాజాగా అభినయ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. ఇందుకు సంబంధించిన ఫోటోస్ షేర్ చేసింది.
Updated on: Apr 17, 2025 | 4:48 PM

టాలీవుడ్ నటి అభినయ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. హైదరాబాద్ కు చెందిన వి.కార్తిక్ అలియాస్ సన్నీ వర్మతో ఆమె ఏడడుగులు వేశారు. వీరిద్దరి వివాహం జూబ్లీహిల్స్ లోని జె.ఆర్.సి కన్వెన్షన్ సెంటల్ లో ఘనంగా జరిగింది.

ఈనెల 20న రిసెప్షన్ నిర్వహించనున్నారు. ఈ వేడుకు సౌత్ ఇండస్ట్రీలోని స్టార్స్ హాజరుకానున్నట్లు తెలుస్తోంది. మార్చి 9న వీరిద్దరి నిశ్చితార్థం సంప్రదాయ పద్దతిలో ఇరు కుటుంబసభ్యుల సమక్షంలో జరిగిన సంగతి తెలిసిందే.

నిశ్చితార్థం ఫోటోస్ షేర్ చేస్తూ క్లారిటీ ఇచ్చింది అభినయ. తెలుగులో అభినయకు మంచి ఫాలోయింగ్ ఉందన్న సంగతి తెలిసిందే. రవితేజ నటించిన నేనింతే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ.

ఆ తర్వాత సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, శంభో శివ శంభో వంటి చిత్రాలతో మరింత ఫేమస్ అయ్యింది. అభినయ ఎక్కువగా స్టార్ హీరోలకు చెల్లిగా.. వదినగా కనిపించింది. అలాగే మలయాళంలో హీరోయిన్ గా కనిపించింది.

ఇటీవల మలయాళంలో ఆమె నటించిన పని సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే... తాజాగా తన ఫెళ్లి ఫోటోస్ ఇన్ స్టాలో షేర్ చేసింది అభినయ. దీంతో కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఫ్యాన్స్.




