మరికొన్ని గంటల్లో హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి వివాహం జరగబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరి పెళ్లి వేడుకలు ఇటలీలో ప్రారంభమయ్యాయి. సోమవారం కాక్ టైల్ పార్టీలో టాలీవుడ్ సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఇక మంగళవారం హల్దీ వేడుకలు జరిగాయి. పసుపు వర్ణం దుస్తుల్లో లావణ్య, వరుణ్ తేజ్ మెరిసిపోయారు. లావణ్య పసుపు కలర్ లెహంగా ధరించగా.. వరుణ్ పసుపు రంగు కుర్తా, తెలుపు ప్యాంట్ ధరించారు. ఈ హల్దీ వేడుకకు థీమ్ ను పసుపు, తెలుపు రంగుల్లో డిజైన్ చేశారు. ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన ఫోటోస్ వైరలవుతున్నాయి.