3 ప్యాన్ ఇండియన్ సినిమాలు.. 1200 కోట్ల బిజినెస్.. సూపర్ ప్లాన్..

| Edited By: Phani CH

Mar 24, 2025 | 8:45 PM

ముందుచూపు మంచిదే..! కానీ మరీ ఏడాది ముందే రిలీజ్ డేట్ లాక్ చేసుకునేంత ముందు చూపు మంచిదేనా అని డౌట్ ఇప్పుడు..? మరీ ముఖ్యంగా 2026 మార్చి నెలను చూస్తుంటే భయమేస్తుందిప్పుడు బయ్యర్లకు. దానికి కారణం 3 ప్యాన్ ఇండియన్ సినిమాలు.. 1200 కోట్ల బిజినెస్..! మరింతకీ మార్చి 2026లో రాబోయే ఆ సినిమాలేంటి..?

1 / 5

2026 మార్చి 26.. ఈ డేట్ ముందుగా లాక్ చేసుకున్నది నాని. దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెలతో ఈయన చేస్తున్న రెండో సినిమా ది ప్యారడైజ్. ఈ మధ్యే టైటిల్ టీజర్ విడుదలైంది. త్వరలోనే రెగ్యులర్ షూట్ మొదలు కానుంది.

2 / 5
ఒక్కసారి షూట్ స్టార్ట్ అయితే.. పూర్తయ్యేవరకు నో బ్రేక్స్. ఇక నాని వస్తున్న ఆ రోజే.. రామ్ చరణ్ కూడా రావాలని చూస్తున్నారు. బుచ్చిబాబుతో రామ్ చరణ్ చేస్తున్న సినిమా రిలీజ్ డేట్ సైతం మార్చి 26, 2026 అని తెలుస్తుంది.

3 / 5
ఈ రెండు సినిమాల బిజినెస్ దాదాపు 700 కోట్ల పైమాటే. పైగా ఇటు రామ్ చరణ్‌కు రంగస్థలం, ట్రిపుల్ ఆర్ మార్చిలోనే విడుదలై సంచలనం సృష్టించాయి.. మరోవైపు నాని కెరీర్‌ను మార్చేసిన దసరా వచ్చింది కూడా మార్చిలోనే.

4 / 5

తాజాగా టాక్సిక్ కూడా మార్చిలోనే రానుంది. యశ్ హీరోగా గీతూ మోహన్‌దాస్ తెరకెక్కిస్తున్న టాక్సిక్ చిత్ర షూటింగ్ సగానికి పైగా పూర్తైంది. ఈ చిత్ర రిలీజ్ డేట్ లాక్ చేసారు మేకర్స్. మార్చి 19, 2026న విడుదల కానుంది ఈ సినిమా.

5 / 5
అంటే చరణ్, నాని కంటే ఒక వారం ముందొస్తున్నారు రాకింగ్ స్టార్. ఈ సినిమా బిజినెస్ 400 కోట్లకు పైగానే జరుగుతుంది. మొత్తానికి 2026 మార్చి ప్యాన్ ఇండియన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిపోయింది.