Trisha Krishnan: చెన్నై సుందరికి మరో బిగ్ ఆఫర్.. రాకెట్‌లా దూసుకుపోతున్న కెరీర్ గ్రాఫ్..

20 ఏళ్లుగా వెండితెర మీద స్టార్ ఇమేజ్‌ కంటిన్యూ చేస్తున్నారు బ్యూటీ త్రిష కృష్ణన్‌. సౌత్‌ ఇండస్ట్రీలో స్టార్ హీరోలందరితోనూ జోడి కట్టిన ఈ బ్యూటీ ఆ మధ్య కెరీర్‌లో స్లో అయ్యారు. ఇక త్రిష కెరీర్‌ ముగిసినట్టే అనుకుంటున్న టైమ్‌లో ..

|

Updated on: May 29, 2023 | 6:20 PM

నిన్న మొన్నటి వరకు ఒక్క హిట్ అంటూ ఎదురుచూసిన క్రేజీ బ్యూటీ ఇప్పుడు ఫుల్ ఫామ్‌లో దూసుకుపోతున్నారు. సీనియర్ సెగ్మెంట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తరువాత హీరోయిన్ల కెరీర్‌ కాస్త స్లో అవుతుంది. అలాంటి స్లో ఫేజ్‌ను ఫేస్‌ చేసిన ఓ బ్యూటీ ఇప్పుడు జెట్‌ స్పీడుతో బౌన్స్‌ బ్యాక్ అయ్యారు.

1 / 6
20 ఏళ్లుగా వెండితెర మీద స్టార్ ఇమేజ్‌ కంటిన్యూ చేస్తున్నారు బ్యూటీ త్రిష కృష్ణన్‌. సౌత్‌ ఇండస్ట్రీలో స్టార్ హీరోలందరితోనూ జోడి కట్టిన ఈ బ్యూటీ ఆ మధ్య కెరీర్‌లో స్లో అయ్యారు. ఇక త్రిష కెరీర్‌ ముగిసినట్టే అనుకుంటున్న టైమ్‌లో 96 సినిమాతో మరోసారి బౌన్స్ బ్యాక్ అయిన ఈ బ్యూటీ... ఇప్పుడు వరుస అవకాశాలతో దూసుకుపోతున్నారు.

2 / 6
లేడీ ఓరియంటెడ్ సినిమాలతో బిజీగా ఉన్న త్రిష... రీసెంట్‌గా పొన్నియిన్ సెల్వన్‌తో మరో బ్లాక్ బస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. ఈ సినిమా విషయంలో ఆన్‌ స్క్రీన్ మాత్రమే కాదు.. ప్రమోషన్స్‌లోనూ త్రిష గ్లామర్ సినిమాకు చాలా హెల్ప్ అయ్యింది. అందుకే ఇప్పుడు ఈ బ్యూటీతో జోడికి స్టార్ హీరోలు కూడా క్యూ కడుతున్నారు.

3 / 6
ప్రజెంట్ విజయ్‌ హీరోగా తెరకెక్కుతున్న లియో సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారు త్రిష. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో స్టార్ హీరో కూడా ఈ బ్యూటీతో జోడికి రెడీ అవుతున్నారు. వరుస విజయాలతో మంచి ఫామ్‌లో ఉన్న అజిత్ కూడా త్రిషతో స్క్రీన్‌ షేర్ చేసుకునేందుకు ఓకే చెప్పారు.

4 / 6
గతంలో కిరీడం, మంగాత్త, ఎంతవాడుగానీ సినిమాల్లో కలిసి అజిత్, త్రిష నటించారు. ఆ సినిమాలన్నీ సూపర్ హిట్స్ కావటంతో ఇప్పుడు మరోసారి అదే మ్యాజిక్‌ను రిపీట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. అదే జరిగితే మరోసారి త్రిష కోలీవుడ్ లక్కీ మస్కట్‌గా మారటం ఖాయం అంటున్నారు క్రిటిక్స్‌.

5 / 6
ఓ రకంగా 2023లో ఆమె కెరీర్ గ్రాఫ్ పైపైకి దూసుకుపోతుండంతో ఆమె ఫ్యాన్స్ కుషీ అవుతున్నారు.

6 / 6
Follow us