
ఇక్కడ డాన్స్ చేస్తున్నది ఎవరో యాక్టర్ కాదు.. డైరెక్టర్ ఆఫ్ మ్యాడ్ అండ్ మ్యాడ్ స్క్వేర్. చాలా కామ్‌గా కనిపించే ఈయనలో ఇంత మాస్ యాంగిల్ ఉందని ఎవరైనా ఊహించారా..? నిన్న మ్యాడ్ స్క్వేర్ ఈవెంట్‌లో కళ్యాణ్ శంకర్ డాన్స్ వైరల్ అవుతుంది బాగా..! ఈయనొక్కడే కాదు.. అనిల్ రావిపూడి కూడా మల్టీటాలెంటెడే.

అనిల్ రావిపూడిని చూస్తే ఏ కోశానా దర్శకుడిలా కనిపించడు.. ఆయనలో అద్భుతమైన నటుడే కాదు డాన్సర్ కూడా ఉన్నారు. ఆయన అప్పుడప్పుడూ బయటికొస్తుంటాడు. చాలామంది ఫ్యాన్స్ ఆయన్ని హీరో మెటీరియల్ అని కూడా అంటుంటారు.

సంక్రాంతికి వస్తున్నాం ప్రమోషనల్ వీడియోలలో అనిల్ కామెడీ టైమింగ్ అందరికీ తెలిసింది. తాజాగా చిరంజీవి కోసం ఇదే మొదలుపెట్టారు. అనిల్ రావిపూడి అడీషనల్ టాలెంట్ ఆయన సినిమాలకు బాగా హెల్ప్ అవుతుంది.

జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ కేవీకి దర్శకుడిగా ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో.. ఆయన కామెడీ టైమింగ్‌కే అంతేమంది ఫ్యాన్స్ ఉన్నారు. మనోడు బయట కనిపిస్తే కడుపులు చెక్కలే. కొన్ని టెలివిషన్ షోలకి ఈయన ఉన్న ఎపిసోడ్స్ మరి టీఆర్పి వచ్చింది.

అలాగే తరుణ్ భాస్కర్ కూడా డైరెక్షన్‌తోనే కాదు.. నటుడిగా మెప్పిస్తున్నారు. తరుణ్ భాస్కర్ కామెడీకి సపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది. ఇది అయన సినిమాలు ప్లస్ అవుతుంది. అందుకే చెప్పేది మన కుర్ర దర్శకులంతా మల్టీ టాలెంటెడ్ అని..!