Tollywood News: మాస్ మూవీలపై మక్కువ చూపిస్తున్న టాలీవుడ్ స్టార్ హీరోలు

| Edited By: Phani CH

May 30, 2024 | 6:15 PM

ఫ్లాపుల్లో ఉన్న హీరోలు మళ్లీ ఫామ్‌లోకి రావాలంటే మాస్ సినిమాలకు మించిన ఆప్షన్ మరోటి లేదా..? ఏమో ఇప్పుడు మన హీరోల తీరు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది మరి. ఎందుకంటే వరస ఫ్లాపుల్లో ఉన్న హీరోలంతా పూర్తిగా మాస్ సినిమాల వైపు అడుగులేస్తున్నారు. కళ్యాణ్ రామ్, అల్లరి నరేష్ అయితే పూర్తిగా గెటప్స్ మార్చేసారు. మరి వాళ్ల మాస్ ముచ్చట్లేంటో చూద్దామా..? మాస్ సినిమా అంటే రొటీన్ అనుకుంటారు కానీ ఒక్కసారి అది కానీ క్లిక్ అయిందంటే వచ్చే వసూళ్ళ వర్షం మామూలుగా ఉండదు.

1 / 5
ఫ్లాపుల్లో ఉన్న హీరోలు మళ్లీ ఫామ్‌లోకి రావాలంటే మాస్ సినిమాలకు మించిన ఆప్షన్ మరోటి లేదా..? ఏమో ఇప్పుడు మన హీరోల తీరు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది మరి. ఎందుకంటే వరస ఫ్లాపుల్లో ఉన్న హీరోలంతా పూర్తిగా మాస్ సినిమాల వైపు అడుగులేస్తున్నారు. కళ్యాణ్ రామ్, అల్లరి నరేష్ అయితే పూర్తిగా గెటప్స్ మార్చేసారు. మరి వాళ్ల మాస్ ముచ్చట్లేంటో చూద్దామా..?

2 / 5
మాస్ సినిమా అంటే రొటీన్ అనుకుంటారు కానీ ఒక్కసారి అది కానీ క్లిక్ అయిందంటే వచ్చే వసూళ్ళ వర్షం మామూలుగా ఉండదు. అందుకే హిట్ కొట్టడానికి మాస్ సినిమాలే కరెక్ట్ అంటున్నారు ఫ్లాప్ హీరోలు. తాజాగా కళ్యాణ్ రామ్ కొత్త సినిమా ప్రీ లుక్ విడుదలైంది. ప్ర‌దీప్ చిలుకూరి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో విజ‌య‌శాంతి కీల‌క పాత్రలో నటిస్తున్నారు.

3 / 5
పూర్తిగా యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లోనే సాగే సినిమా ఇది. టీజర్ చూస్తుంటేనే ఈ విషయం అర్థమైపోతుంది. అల్లరి నరేష్ కూడా అహ నా పెళ్లంట ఫ్లాప్ అవ్వడంతో.. మాస్ బాట పట్టారు. నాందీ, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, ఉగ్రం తర్వాత.. రిలీఫ్ కోసం ఆ ఒక్కటి అడక్కు అంటూ కామెడీ చేస్తే వర్కవుట్ అవ్వలేదు.

4 / 5
అందుకే బచ్చలమల్లి అంటూ పక్కా మాస్ బొమ్మతో వచ్చేస్తున్నారు ఈ అల్లరోడు. సోలో బ్రతుకే సో బెటర్ ఫేమ్ సుబ్బు తెరకెక్కిస్తున్న బచ్చలమల్లి 80స్ నేపథ్యంలో వస్తుంది. పుష్ప, దసరా తరహాలో.. ఇందులోనూ అల్లరి నరేష్ పాత్ర ఉండబోతుందని ఫస్ట్ లుక్ చూస్తుంటేనే అర్దమవుతుంది.

5 / 5
రాబిన్ హుడ్‌తో నితిన్ కూడా మాస్ బాటే పట్టారు. ఆయనే కాదు.. గోపీచంద్, శ్రీనువైట్ల విశ్వం సినిమా కూడా ఊర మాస్ సినిమానే. మరి ఈ మాస్ సినిమాలు మన హీరోలను హిట్ బాట పట్టిస్తాయో లేదో చూడాలి.