
ప్రేమించడం మొదలు పెడితే మన తెలుగు వాళ్ల కంటే బాగా ఎవరూ ప్రేమించలేరు. అందుకే ఒక్కసారి టాలీవుడ్‌లో మార్కెట్ వచ్చిందంటే అది పెంచుకోడానికే ప్రయత్నిస్తుంటారు స్టార్స్. తాజాగా అలియా భట్ ఇదే పనిలో బిజీగా ఉన్నారు. ఈమె కోసం బడా హీరోలతో పాటు హీరోయిన్లు కూడా రంగంలోకి దిగుతున్నారు. మరి అలియా కోసం వస్తున్న ఆ స్టార్స్ ఎవరు..?

ట్రిపుల్ ఆర్‌లో కనిపించింది కాసేపే అయినా మంచి ఇంపాక్ట్ ఉన్న పాత్రే చేసారు అలియా భట్. ఈ సినిమాతో టాలీవుడ్‌లోనూ అలియాకు మంచి గుర్తింపు వచ్చింది. ఇదే ఇమేజ్ వాడుకుంటూ తన సినిమాలను తెలుగులోనూ విడుదల చేస్తున్నారు ఈ బ్యూటీ.

తాజాగా జిగ్రా సినిమాను తెలుగులో భారీగానే ప్రమోట్ చేస్తున్నారు. పైగా మన బడా స్టార్స్ కూడా హెల్ప్ చేస్తున్నారు. అక్టోబర్ 11న విడుదల కానుంది జిగ్రా. వసన్ బాలా తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో రానా దగ్గుబాటి విడుదల చేస్తున్నారు. ఆయన ఎంట్రీతో జిగ్రాపై ఆసక్తి పెరిగింది.

అయితే నిన్న మొన్నటి వరకు కోలీవుడ్‌లో భారీ వసూళ్ల విషయంలో కాస్త అనుమానాలు కనిపించినా.. లేటెస్ట్ అప్‌డేట్‌తో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. కొత్త ఏడాదికి గ్రాండ్‌గా వెల్ కం చెప్పేందుకు రెడీ అవుతోంది గేమ్ చేంజర్ మూవీ. మోస్ట్ అవెయిటెడ్ లిస్ట్‌లో ఉన్న ఈ సినిమా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజాగా జిగ్రా తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. దీనికి సమంత వస్తున్నారని ప్రచారం జరుగుతుంది. ఈ మధ్య బయటికి రాని స్యామ్.. జిగ్రా కోసం వస్తే మాత్రం ఫుల్ ప్రమోషన్ ఖాయం. మరి ఇంతమంది సపోర్ట్‌తో అలియా తెలుగులో మాయ చేస్తుందేమో చూడాలి.