
ఆల్రెడీ చేయాల్సిన సినిమాల లిస్టు చాంతాడంత ఉన్న హీరోల సంగతి కాసేపు పక్కనపెడితే, ఎప్పటికప్పుడు ప్రూవ్ చేసుకోవాలని తహతహలాడే హీరోలకు మాత్రం ముందు ముందు మంచి రోజులున్నట్టే అనిపిస్తోంది.

చిన్న సినిమాలతో ప్రూవ్ చేసుకుంటున్న కెప్టెన్లకు అవకాశాలిస్తే, ఫ్యూచర్‌లో బ్లాక్ బస్టర్ హిట్లు ఖాయమనే మాట ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తోంది. నా దగ్గర 30కి పైగా కథలున్నాయి. దేనికదే చాలా స్పెషల్‌గా ఉంటుంది.

అవకాశం ఉంటే డైరక్షన్ మానేసి, కథలు రాసుకోవడంలోనే హ్యాపీగా ఉంటా అని ప్రశాంత్ వర్మ ఓపెన్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. కెప్టెన్‌గానూ ఆయన స్టామినా ఏంటో చెప్పకనే చెప్పింది హనుమాన్. రీసెంట్‌గా దీపావళికి సెన్సేషనల్ హిట్ అయిన 'క' కెప్టెన్లను కూడా అంత తేలిగ్గా తీసేయడానికి వీల్లేదు.

ఎగ్జయిటింగ్ ట్విస్టుతో ఆడియన్స్ కి గూస్‌బంప్స్ తెప్పించేశారు క మూవీ కెప్టెన్స్ సుజీత్ అండ్ సందీప్. దీపావళికే లక్కీ భాస్కర్‌ని రిలీజ్ చేసి యునానిమస్ హిట్ టాక్ తెచ్చుకున్నారు వెంకీ అట్లూరి.

అటు అమరన్ కెప్టెన్‌కి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. జస్ట్ వీళ్లే కాదు... రీసెంట్ టైమ్స్ లో ఇలా ప్రూవ్ చేసుకున్న కెప్టెన్లు ఇంకా చాలా మందే ఉన్నారు. వాళ్ల దగ్గరున్న స్క్రిప్టులకు పర్ఫెక్ట్ హీరోలు యాడ్ అయితే... టాలీవుడ్‌లో హిట్ పర్సెంటేజ్ అమాంతం పెరుగుతుందనే డిస్కషన్ షురూ అయింది.