
సినీరంగంలో నటిగా గుర్తింపు తెచ్చుకోవాలంటే అందం, అభినయంతోపాటు కాసింత అదృష్టం సైతం ఉండాలి. ఒకప్పుడు వరుస సినిమాలతో స్టార్ డమ్ అందుకున్న ఓ హీరోయిన్.. ఇప్పుడు ఇండస్ట్రీలో సైలెంట్ అయ్యింది. ప్రస్తుతం హీరోయిన్స్ అందరూ కోట్లలో రెమ్యునరేషన్ తీసుకుంటుండగా.. ఆమె లక్షల్లోనే సంపాదిస్తుంది.

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె క్రేజీ హీరోయిన్. తెలుగు, తమిళం, హిందీ భాషలలో స్టార్ హీరోలతో కలిసి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. ఒకప్పుడు ఇండస్ట్రీలోని టాప్ హీరోయిన్లలో ఆమె ఒకరు. కానీ కొన్నాళ్లుగా ఈ బ్యూటీ సైలెంట్ అయ్యింది. అంతగా సినిమాల్లో కనిపించడం లేదు. కొత్త సినిమాలతోపాటు.. ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మూవీస్ నుంచి తప్పుకుని షాకిచ్చింది.

కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్న ఈ బ్యూటీ.. ఇప్పుడిప్పుడే తిరిగి బిజీ అవుతుంది. ఆమె మరెవరో కాదండి.. హీరోయిన్ పూజా హెగ్డే. ఇటీవలే సూర్య సరసన రెట్రో మూవీతో అడియన్స్ ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను నిరాశపరిచింది.

కానీ ఇప్పుడు మోనికా పాటతో ఈ అమ్మడు పేరు మరోసారి మారుమోగుతుంది. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తున్న కూలీ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ చేసింది. మోనికా అంటూ వచ్చే ఈ పాటలో పూజా గ్లామర్ ప్రెజన్స్, స్టెప్పులతో నెట్టింట హైలెట్ అయ్యింది ఈ అమ్మడు.

అయితే ఈ పాటకు పూజా కేవలం రూ.70 లక్షలు మాత్రమే పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. సాధారణంగా ఒక్కో స్పెషల్ చేసేందుకు హీరోయిన్స్ కోట్లలో రెమ్యునరేషన్ తీసుకుంటుండగా.. పూజా మాత్రం కేవలం రూ.70 లక్షలు తీసుకోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.