సంక్రాంతికి మూడు నెలలు ఉండగానే రేస్ ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే పండక్కి మేమొస్తున్నామంటూ.. మహేశ్ గుంటూరు కారం, రవితేజ ఈగల్, వెంకటేశ్ సైంధవ్, నాగార్జున నా సామిరంగా, యంగ్ హీరో తేజ సజ్జా హనుమాన్, విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ ఖర్చీఫ్ వేసాయి. వీళ్లు సరిపోరన్నట్లు తమిళం నుంచి రజినీ లాల్ సలామ్, శివకార్తికేయన్ అయలాన్ కూడా రేసులోనే ఉన్నాయి.