
యూట్యూబర్ గా కెరీర్ స్టార్ట్ చేసి షార్ట్ ఫిల్మ్స్ తో నెట్టింట మంచి పాపులారిటీ తెచ్చుకుంది సోనియా సింగ్. ‘రౌడీ బేబీ’, ‘హే పిల్ల’ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా ఆమె చేసిన వీడియోలకు మంచి స్పందన వచ్చింది.

ఈ క్రేజ్‌తోనే పలు సీరియల్స్ లోనూ, టీవీ షోస్ లోనూ ఛాన్స్ దక్కించుకుంది సోనియా సింగ్. అలాగే సినిమాల్లోనూ సందడి చేస్తోంది.

2023లో ‘విరూపాక్ష’ సినిమాలో సోనియా సింగ్ పోషించిన పాత్రకు మంచి పేరొచ్చింది. అలాగే నితిన్, శ్రీలీల జంటగా నటించిన ఎక్స్‌ట్రార్డినరి మ్యాన్ మూవీలోనూ ఓ కామెడీ రోల్ తో ఆకట్టుకుంది

ఆ మధ్యన తన బాయ్ ఫ్రెండ్ పవన్ సిద్దూతో కలిసి శశి మథనం అనే ఓటీటీ సినిమాతోనూ ఆడియెన్స్ ను పలకరించింది సోనియా సింగ్.

తాజాగా అరుణాచలేశ్వర్ వెళ్లింది సోనియా సింగ్. అక్కడ తన ప్రియుడు సిద్ధూ పవన్ తో గిరి ప్రదక్షణ చేసి శివుడ్ని దర్శనం చేసుకుంది.

అనంతరం తన ఆధ్యాత్మిక యాత్రకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.