అప్ కమింగ్ సినిమాల లైనప్‌తో ఊరిస్తున్న డైరెక్టర్.. ఇంతకీ ఎవరంటే?
రజనీకాంత్ హీరోగా కూలీ సినిమా తెరకెక్కిస్తున్న లోకేష్ కనగరాజ్, అప్ కమింగ్ సినిమాల లైనప్‌తో ఊరిస్తున్నారు. ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్స్ అన్న రేంజ్‌లో పేరు తెచ్చుకున్న హీరోలు ఇప్పుడు లోకేష్ లైనప్‌లో ఉండటం హాట్ టాపిక్ అవుతోంది. దీంతో ఈ సినిమాలు గురించి అఫీషియల్ ఎనౌన్స్‌మెంట్ కన్నా ముందు నుంచే డిస్కషన్ జరుగుతోంది.
Updated on: Jan 19, 2025 | 7:35 PM

కూలీ సినిమా పనుల్లో బిజీగా ఉన్న లోకేష్, ఆ తరువాత చేయబోయే సినిమాల గురించి కూడా లీకులిస్తున్నారు. నెక్ట్స్ ఖైదీ 2 స్టార్ట్ చేస్తానని ఆల్రెడీ కన్ఫార్మ్ చేశారు. అయినా షెడ్యూల్ గ్యాప్స్‌లో ఆ తరువాత చేయబోయే సినిమాల గురించి లీకులిస్తున్నారు. కూలీ సినిమాలో గెస్ట్ రోల్ చేస్తున్న ఆమిర్ ఖాన్‌తో లోకేష్ మూవీ ప్లాన్ చేస్తున్నారన్నది లేటెస్ట్ అప్‌డేట్.

ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచే భారీ సూపర్ హీరో కాన్సెప్ట్‌తో ఓ సినిమా చేసే ఆలోచన ఉందని చెబుతూ వస్తున్నారు లోకేష్. ఇరుంబు కై మాయావి పేరుతో భారీ గ్రాఫికల్ మూవీని ఎప్పుడో ఎనౌన్స్ చేశారు. గతంలో సూర్య హీరోగా ఈ సినిమా చేస్తానని చెప్పినా... ఇప్పుడు ఆమిర్‌తో ప్లాన్ చేస్తున్నారన్నది నయా అప్‌డేట్.

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా లోకేష్ ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారన్న ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. ప్రభాస్‌ను కలిశానంటూ లోకేష్ కూడా కన్ఫార్మ్ చేయటంతో ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుందా అని ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు డార్లింగ్ డైహార్డ్ ఫ్యాన్స్.

లొకేష్ యూనివర్స్ నుంచి రావాల్సిన విక్రమ్ 2, రోలెక్స్, లియో 2 సినిమాలు కూడా కలుపుకుంటే సౌత్, నార్త్ అన్న తేడా లేకుండా ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్స్ అంతా ఇప్పుడు లోకేష్ లైనప్‌లోనే కనిపిస్తున్నారు.