Top Viewed Teasers: రాజాసాబ్‌ సహా.. 24 గంటల్లో టాప్ వ్యూస్ పాన్ ఇండియా టీజర్లు ఇవే..

Updated on: Jun 17, 2025 | 7:04 PM

తాజాగా ప్రభాస్ హీరోగా హారర్ రొమాంటిక్ కామెడీ మూవీ టీజర్ విడుదలైంది. దీన్ని తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ చేసారు మేకర్స్. ఇది అన్ని భాషలు కలుపుకొని 24 గంటల్లో 31.5 మిలియన్ వ్యూస్ చేసి టాప్ 7లో నిలిచింది. దీంతో 24 గంటల్లో టాప్ వ్యూస్ సంధించిన టాప్ 5 పాన్ ఇండియా టీజర్స్ ఏంటి.? అని చర్చ మొదలైంది. మరి 24  గంటల్లో అత్యధికంగా వీక్షించబడిన 5 పాన్ ఇండియా టీజర్లు ఏంటి.? ఈరోజు చూద్దాం.. 

1 / 5
టీజర్ విడుదలైన 24 గంటల్లో టాప్ వ్యూస్ సంధించిన సినిమాగా నిలిచింది 'సలార్ పార్ట్ 1: సీజ్ ఫైర్'. ఈ మూవీ టీజర్ 24 గంటల్లో 83 మిలియన్ వ్యూస్‎తో రికార్డు క్రియాట్ చేసింది. 2023లో ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. 700 కోట్లకు పైగా వసూళ్లు సంధించింది.

2 / 5
సెకండ్ ప్లేస్‎లో కూడా డార్లింగ్ మూవీనే ఉంది. అది ప్రభాస్ రాముడుగా, కృతి సనాన్ సీతగా నటించిన 'అదిపురుష్'. దీని టీజర్ 24 గంటల్లో 68.96 మిలియన్ వ్యూస్ సందించింది. అయితే ఈ సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. అయినప్పటికీ 450 కోట్లు కొల్లగొట్టింది ఈ సినిమా. 

3 / 5
యాష్, ప్రశాంత్ నీల్ కాంబోలో కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన 'కెజిఫ్ చాప్టర్ 2'  68.83 మిలియన్ వ్యూస్‎తో మూడవ స్థానంలో నిలిచింది. ఇది పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయాన్ని అందుకుంది. బాక్స్ ఆఫీస్ వద్ద 1250 కోట్లు వసూళ్లతో 1000 కోట్ల క్లబ్‎లో చేరిన తొలి కన్నడ సినిమాగా నిలిచింది. 

4 / 5
ఈ జాబితాలో మరో ప్రభాస్ మూవీ రికార్డు సెట్ చేసింది. అదే డార్లింగ్, పూజ హెగ్డే జంటగా వచ్చిన 'రాధేశ్యామ్'. ఇది భారీ పరాజయాన్ని ఉంది. ఈ సినిమా టీజర్ 24 గంటల్లో 42.66 మిలియన్ వ్యూస్ అందుకొని టాప్ 4లో నిలిచింది.

5 / 5
ఈ లిస్టులో టాప్ 5 ఉంది అల్లు అర్జున్ హీరోగా నటించిన 'పుష్ప 2 ది రూల్'. ఈ మూవీ టీజర్ 24 గంటల్లో 39.36 మిలియన్ వ్యూస్ అందుకుంది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 2024లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది. ఈ సినిమా 1700 కోట్లకు పైగా వసూళ్లు చేసి 1000 కోట్లు కొట్టిన నాలుగవ తెలుగు సినిమాగా నిలిచింది. 