- Telugu News Photo Gallery Cinema photos These are the heroines who made good decisions for their husbands
అలాంటి సీన్లలో నటించం.. భర్త కోసం ఈ హీరోయిన్లు చేసిన పనికి అందరూ ఫిదా!
చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఏ సీన్స్‌లోనైనా నటించడం కామన్. కానీ పెళ్లికి ముందు ఒకలా ఉంటే, పెళ్లి తర్వాత కొంత మంది కొన్ని హద్దులు పెట్టుకుంటారు. అలానే టాలీవుడ్ హీరోయిన్స్ తమ భర్త కోసం షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. అవి వారి కెరీర్‌కు ఎఫెక్ట్ అయినా పర్లేదు అంటూ.. తమ మనసులోని మాటను డైరెక్టర్స్‌కు ముందే చెప్పేశారు. ఇంతకూ వారు తీసుకున్న నిర్ణయం ఏమిటంటే?
Updated on: Mar 28, 2025 | 2:52 PM

పెళ్లి తర్వాత కొందరు సినిమాలు తీయడం మానేస్తే, మరికొందరు మాత్రం సినిమాలు తీసినప్పటికీ, వారు మంచి కథను ఎంచుకుంటూ, గ్లామర్ పాత్రలకు కాస్త దూరంగా ఉంటారు. అయితే అలానే ముగ్గు హీరోయిన్లు తమ భర్తల కోసం కొన్ని సీన్లలో నటించడానికి నో చెప్పారు. వారు ఎవరంటే?

అలనాటి అందాల ముద్దుగుమ్మ సౌందర్య క్రేజ్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. ఈ నటి పెళ్లికి ముందే షాకింగ్ డెసిషన్ తీసుకుందంట. వివాహం జరిగిన తర్వాత అస్లే రొమాంటిక్ సీన్లలో నటించను అని తెగేసి చెప్పిందంట.

యమదొంగ సినిమాతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న ముద్దుగుమ్మ ప్రియమణి. ఈ అమ్మడు తనను సినిమాల్లో తన భర్త, పిల్లలు చూసినప్పుడు ఇబ్బందిగా ఫీల్ అవ్వకూడదని, ఇంటిమేట్ సీన్లలో నటించడం లేదని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.

బాలీవుడ్ బ్యూటీ, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్, వివాహం తర్వాత పూర్తిగా సినిమాలకు గుడ్ బై చెప్పి, ఫ్యామిలీని చూసుకుంటూ గడిపేస్తుంది.

అలాగే రీసెంట్‌గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో యంగ్ బ్యూటీ శ్రీలీల తన మొదటి లిప్ కిస్ తనకు కాబోయే భర్తకే అంటూ తెలిపిన విషయం తెలిసిందే. ఇలా ఈ ముద్దుగుమ్మలు తమకు కాబోయే భర్త కోసం మంచి నిర్ణయాలు తీసుకున్నారంటున్నారు వారి అభిమానులు.





























