పెద్ద వంశీ సినిమాతో పోలిక! ఛాంగురే బంగారు రాజాలో పెద్ద వంశీ సినిమాల్లోని కథల ఫ్లేవర్ కనిపిస్తుంది. హీరో, విలన్ అని కాకుండా ప్రతి పాత్రకూ పాజిటివ్ అండ్ నెగిటివ్ షేడ్స్ వుంటాయి. రవి బాబు గారు, సత్యతో మిగతా పాత్రలన్నీ చాలా హిలేరియస్ గా వుంటాయి. రవిబాబు గారు అద్భుతమైన టైమింగ్ యాక్టర్. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. నేను ఇంతకుముందు చేసిన సీరియస్ పాత్రలలో మాడ్యులేషన్, డైలాగ్, లుక్, వాయిస్ ఇవన్నీ ఆ పాత్రలకు తగ్గట్టుగా వుండాల్సివచ్చింది. ఇందులో మాత్రం నేను సహజంగా ఎలా ఉంటానో అలా వుంటే చాలన్నారు. ఇది నాకు చాలా ఈజీ అనిపించింది. కామెడీ చేయడం చాలా కష్టం అంటారు. కానీ రైటింగ్ బావుంటే ఈజీగా చేయొచ్చనిపించింది.