
దానివల్ల అవుట్ పుట్ కూడా చాలా రిఫ్రిషింగ్ గా వస్తుంది. అందుకే ఈ తరం దర్శకులుగా పనిచేయడానికి సీనియర్ హీరోలు ఆసక్తిగా ఉన్నారు. ఎక్కడి వరకో ఎందుకు బాలకృష్ణని తీసుకుందాం.. ఒకప్పుడు సీనియర్ దర్శకులతో ఆయన సినిమాలు చేసినప్పుడు పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఎవరో బి గోపాల్ లాంటి ఒకరిద్దరి దర్శకులు మాత్రమే బాలయ్యకు పెద్ద హిట్లు ఇచ్చారు. కానీ కొన్ని సంవత్సరాలుగా ఈయన తన ఆలోచన శైలి మార్చుకొని బోయపాటి శ్రీను, అనిల్ రావిపూడి, బాబి, గోపీచంద్ మలినేని లాంటి ఈ జనరేషన్ దర్శకులతో పనిచేస్తున్నారు. దాంతో బాలయ్య ఇమేజ్ ఒక్కసారిగా 100 కోట్లకు పెరిగిపోయింది.

మరోవైపు చిరంజీవి కూడా అంతే. బాబితో చేసిన వాల్తేరు వీరయ్య 220 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇప్పుడు వశిష్ట దర్శకత్వంలో నటిస్తున్నాడు చిరంజీవి. ఈ సినిమా బడ్జెట్ 200 కోట్లు ఉంటుందని అంచనా. ఏ నమ్మకంతో అంత బడ్జెట్ పెడుతున్నారు అంటే.. కాంబినేషన్ అలా ఉంది మరి.

మరోవైపు వెంకటేష్ సినిమా వస్తుంది అంటే బజ్ అంతగా ఉండేది కాదు. బిజినెస్ కూడా 20 నుంచి 30 కోట్ల మధ్యలో జరిగేది. కానీ ఇప్పుడు సైంధవ్ సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. దానికి కారణం ఆ సినిమా దర్శకుడు శైలేష్ కొలను. హిట్ సినిమాల ట్రాక్ రికార్డు చూసిన తర్వాత శైలేష్ టేకింగ్ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. దానికి తోడు వెంకటేష్ కూడా చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. అందుకే సంక్రాంతికి అన్ని సినిమాలు వస్తున్నా కూడా సైంధవ్ పోటీ పడుతున్నాడు.

మరోవైపు నాగార్జున కూడా న్యూ ఏజ్ దర్శకులతో పనిచేయడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడు. మొత్తానికి కుర్రదర్శకులతో పని చేస్తూ సీనియర్ హీరోలు తమ మార్కెట్ బాగా పెంచుకుంటున్నారు. ఇది ఎప్పటినుంచి జరుగుతున్న ప్రక్రియ అయినా కూడా ఈ మధ్య కాలంలో దీనికి ఊపు మరింత పెరిగింది.

ముఖ్యంగా బాలయ్య, చిరంజీవి లాంటి సీనియర్ హీరోలు కేవలం యంగ్ డైరెక్టర్స్ వైపు మాత్రమే చూస్తున్నారు. తమిళ ఇండస్ట్రీలో కూడా రజనీకాంత్, కమల్ హాసన్ ఇలాంటి సీనియర్ హీరోలు లోకేష్ కనకరాజ్, నెల్సన్, కార్తీక్ సుబ్బరాజ్ లాంటి యంగ్ డైరెక్టర్స్ తో పని చేస్తున్నారు. అందుకే అవుట్ ఫుట్ కూడా అలా వస్తుంది.. కలెక్షన్స్ కూడా వందల కోట్లు వస్తున్నాయి.