
కొన్ని సినిమాలు చిన్నగా వచ్చి, భారీగా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. అలాంటి సినిమాలలో ‘లాపతా లేడీస్’ ఒకటి. సింపుల్ విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో, అందమైన కథతో, కొత్తఫేస్‌లతో రూపొందిన ఆ సినిమా బాక్సాఫీస్‌తో పాటు విమర్శకులను కూడా ఆకట్టుకుంది.

ఈ సినిమా సక్సెస్‌తో వచ్చే మ్యాజిక్ ఇప్పుడు ఆ సినిమాలో నటించిన నటీమణులు స్పర్షా శ్రీవాత్సవ్, ప్రతిభా రంతా జీవితాలను మార్చేస్తోంది. స్పర్షా అప్పటికే నాగచైతన్య సినిమాలో ఒక కీలక పాత్ర దక్కించుకున్నాడు.

ఇక ప్రతిభా రంతా మాత్రం శార్వరీ వాఘ్, అభయ్ వర్మతో కలిసి నటించే ‘ముంజ్యా 2’ అనే క్రేజీ సీక్వెల్‌లో లీడ్ ఛాన్స్ పట్టేసింది. ముఖ్యంగా ప్రతిభా రంతా – గ్లామర్, యాక్టింగ్ రెండింటిలోనూ ప్రూవ్ చేసుకున్నారు.

అందుకే ఆమె మరిన్ని అవకాశాలు అందుకోవటం ఖాయం అంటున్నారు ట్రేడ్ అనాలిస్ట్. సరైన అవకాశాలు వస్తే ఈ బ్యూటీ నెక్స్ట్ జనరేషన్ స్టార్ హీరోయిన్ అవ్వగల కెపాసిటీ ఉందని నమ్ముతున్నారు.

ఏది ఏమైనా ‘లాపతా లేడీస్’ తారల కెరీర్ ఇప్పుడు పూర్తిగా మారిపోయిందనే చెప్పాలి.. ప్రస్తుతం 2X స్పీడ్‌తో పరిగెడుతోంది అంటే ఏ మాత్రం అతి శయోక్తి కాదు.