
ఆడియన్స్ మునపట్లా థియేటర్లకు రావట్లేదంటూ నిర్మాతలు ఓ మాట అనేస్తున్నారు కానీ ఆడియన్స్ బానే వస్తున్నారు.. కానీ వాళ్లను థియేటర్ వరకు రప్పించే కంటెంట్ ఇవ్వట్లేదు మన మేకర్స్. వాళ్లకు అది ఒప్పుకోడానికి ఇగో అడ్డొస్తుంది.

మహావతార్ నరసింహాలో ఏ స్టార్ ఉన్నాడని 3 వారాలుగా ఆడుతుంది.. ఇప్పటికే ఇండియాలో 200 కోట్లు వసూలు చేసింది ఈ చిత్రం. స్టార్ హీరో లేడు.. ఆ మాటకొస్తే అసలు రెగ్యులర్ సినిమానే కాదు నరసింహా. పూర్తిగా యానిమేషన్ సినిమా.. జూలై 24న చాలా తక్కువ స్క్రీన్స్‌లో విడుదలై.. 3 వారాల తర్వాత కూడా అదే దూకుడు చూపిస్తుంది ఈ చిత్రం.

దీని కంటే ముందు నాని నిర్మించిన కోర్ట్ రెండు వారాలు ఆడింది.. అది కూడా కంటెంట్ ఉన్న సినిమానే.. పైగా టికెట్ రేట్లలో ఎలాంటి హైక్ లేదు. 2025లో రెండు వారాల తర్వాత కూడా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించిన సినిమాలు కనీసం 5 కూడా లేవు.

సంక్రాంతికి వస్తున్నాం ఒకటి మూడు వారాల వరకు కలెక్షన్స్ తీసుకొచ్చింది. అనిల్ రావిపూడి, వెంకటేష్ కలిసి చేసిన ఈ మ్యాజిక్‌కు కుటుంబ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఆ తర్వాత మరే పెద్ద సినిమా ఈ మ్యాజిక్ చేయలేకపోయింది.

తండేల్, హిట్ 3, మ్యాడ్ స్క్వేర్ లాంటి సినిమాలు మంచి విజయం సాధించాయి.. కానీ ఫస్ట్ వీకెండ్‌లోనే 90 పర్సెంట్ రిటర్న్స్ తీసుకొచ్చి రెండో వారానికి సైలెంట్ అయ్యాయి. ఆ తర్వాత కోర్ట్.. ఇన్నాళ్లకి మహావతార్ నరసింహా 3వ వారంలోనూ ఆడియన్స్‌ను రప్పించాయి. వీటిలో ఏ సినిమాకు టికెట్ రేట్లు పెంచుకోలేదు.. మరి లోపం ఎక్కడుందంటారు..? ఆడియన్స్‌లోనా.. మేకర్స్ ఇచ్చే కంటెంట్‌లోనా..?