ఊపిరితిత్తులు, యూరినరీ సమస్యలతో గద్దర్ ఎప్పటి నుంచో బాధపడుతున్నారు. ఈ అనారోగ్య సమస్యల నుంచి కోలుకోలేకపోవడంతో గద్దర్ ఆరోగ్యం మరింత క్షీణించి మృతి చెందినట్లు వైద్యులు తాజా బులెటిన్‌లో వెల్లడించారు. గద్దర్ మరణ వార్త తెలియగానే సికింద్రాబాద్ భూదేవి నగర్‌లోని ఆయన నివాసం వద్దకు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివస్తున్నారు. ప్రజా యుద్ధనౌకగా పేరుగాంచిన గద్దర్ తెలంగాణ ఉద్యమ కాలంలో తన గొంతుకతో ఉద్యమానికి ఊపిరిపోశారు. పీపుల్స్ వార్, అనంతరం మావోయిస్టు, తెలంగాణ ఉద్యమాల్లో కోట్ల మంది ప్రజలను చైతన్యపరిచారు. కాగా గద్దర్‌కు భార్య, సూర్యుడు, చంద్రుడు, వెన్నెల అనే ముగ్గురు సంతానం ఉన్నారు.