
బాలీవుడ్ ఇండస్ట్రీలో డాన్ త్రీక్వెల్‌కు సంబంధించిన చర్చ చాలా రోజులుగా జరుగుతోంది. ఆ మధ్య ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి అఫీషియల్ ఎనౌన్స్‌మెంట్ కూడా ఇచ్చారు. కానీ ఆ తరువాత ఎలాంటి అప్‌డేట్ లేకపోవటంతో డాన్ 3 ఆగిపోయిందన్న ప్రచారం మొదలైంది. దీంతో మరోసారి త్రీక్వెల్ విషయంలో క్లారిటీ ఇచ్చారు మేకర్స్.

డాన్ 3కి సంబంధించి అఫీషియల్ ఎనౌన్స్‌మెంట్ ఇచ్చిన మేకర్స్ టైటిల్ లోగోతో పాటు ఈ సినిమాలో డాన్ పాత్రలో షారూఖ్‌కు బదులుగా మరో హీరో నటిస్తున్నారన్న క్లారిటీ ఇచ్చారు. దీంతో ఒక్కసారిగా డాన్ అభిమానులు డైలమాలో పడిపోయారు. అమితాబ్ తరువాత ఆ రేంజ్‌లో డాన్ పాత్రకు సూట్ అయ్యారు షారూఖ్. అందుకే మరే హీరోను ఆ రోల్‌లో ఊహించుకోలేకపోతున్నారు.

అఫీషియల్ ఎనౌన్స్‌మెంట్ తరువాత డాన్ 3 విషయంలో గట్టిగానే ట్రోలింగ్ జరిగింది. జస్ట్ టైటిల్ మాత్రమే రివీల్ చేసినా, షారూఖ్ లేని డాన్ ఫ్రాంచైజీని చూడలేమంటు కామెంట్స్ చేశారు ఫ్యాన్స్. ఆ తరువాత ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అప్‌డేట్స్ ఏవీ లేకపోవటంతో ఆడియన్స్ రెస్పాన్స్‌ను దృష్టిలో పెట్టుకొని డాన్ 3ని పక్కన పెట్టేశారా అన్న డౌట్స్ రెయిజ్ అయ్యాయి.

తాజాగా ఈ మూవీ విషయంలో మరోసారి క్లారిటీ ఇచ్చారు మేకర్స్. డాన్ 3 పక్కాగా ఉంటుందన్న మేకర్స్, నెక్ట్స్ ఇయర్ జూన్‌లో ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుందని ఎనౌన్స్ చేశారు. అయితే నయా డాన్, డాన్ 2కి కొనసాగింపే అయినా... షారూఖ్ పోషించిన డాన్ పాత్రకు మాత్రం కొనసాగింపు కాదన్నది యూనిట్ వర్షన్.

డాన్ కథకు ప్యారలల్‌గా రణవీర్ సింగ్ హీరోగా మరో డాన్ రోల్‌ను సృష్టించబోతున్నారు దర్శక నిర్మాత ఫర్హాన్ అక్తర్. అంతేకాదు భవిష్యత్తులో షారూఖ్‌ని మరోసారి డాన్ రోల్‌లో చూపించే ఛాన్స్ లేకపోలేదన్న హింట్ ఇచ్చారు. డాన్ యూనివర్స్ రెడీ అవుతుందన్న న్యూస్ వైరల్ కావటంతో డాన్ 3లో షారూఖ్ సినిమాకు సంబంధించి రిఫరెన్సులు ఉండే ఛాన్స్ ఉంటుందన్న న్యూస్ కూడా ట్రెండ్ అవుతోంది.