
స్పెషల్ సాంగ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోతున్నారు తమన్నా. ఓవైపు హీరోయిన్‌గా వరస సినిమాలు చేస్తూనే.. మరోవైపు స్పెషల్ సాంగ్స్ కూడా చేస్తూనే ఉన్నారు. పైగా తమన్నా అప్పియరెన్స్ ఈ సినిమాలకు కలిసొస్తుంది కూడా.

ముందు సౌత్‌లో రప్ఫాడించిన ఈ బ్యూటీ.. ఇప్పుడు బాలీవుడ్‌లో కుమ్మేస్తున్నారు. అక్కడ ఆమె లక్కీ బ్యూటీ అయిపోయారు కూడా. గతేడాది స్త్రీ 2 కోసం బాలీవుడ్‌లో ఫస్ట్ టైమ్ స్పెషల్ సాంగ్ చేసారు తమన్నా.. అది ఇండస్ట్రీ హిట్ కావడంతో ఈమెకు ఆఫర్స్ క్యూ కడుతున్నాయిప్పుడు.

స్త్రీ 2 తర్వాత తమన్నా బాలీవుడ్ కెరీర్‌కు రెక్కలొచ్చాయి. సినిమాల కంటే ఎక్కువగా మా సినిమాలో ఒక్క పాట చేయండి ప్లీజ్ అనే ఆఫర్స్ ఎక్కవైపోయాయి ఈమెకు. రైడ్ 2లోనూ అదిరిపోయే స్పెషల్ సాంగ్ చేసారీమే.

తమన్నా స్పెషల్ సాంగ్ అనేది సినిమాలకు స్పెషల్‌గా మారుతుందిప్పుడు. అందుకే ఐటం సాంగ్ అనగానే మరో ఆలోచన లేకుండా తమన్నా పేరు తలుచుకుంటున్నారు మేకర్స్. తాజాగా ప్రభాస్ సినిమాలోనూ తమన్నాకు అదిరిపోయే ఆఫర్ వచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. గతంలో ఈ ఇద్దరూ కలిసి రెబల్, బాహుబలి 1 అండ్ 2 సినిమాలలో నటించారు.

ప్రభాస్, మారుతి కాంబినేషన్‌లో వస్తున్న రాజా సాబ్‌లో తమన్నా స్పెషల్ సాంగ్ చేయబోతున్నారనే ప్రచారం జరుగుతుంది. హీరోయిన్‌గా ఈమెకు ఆఫర్స్ పెద్దగా రావట్లేదు గానీ స్పెషల్ సాంగ్స్‌కు మాత్రం కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయారు మిల్కీ బ్యూటీ. తాజాగా రాజా సాబ్‌తోనూ చిందేయడానికి రెడీ అవుతున్నారు తమన్నా. డిసెంబర్ 5న విడుదల కానుంది రాజా సాబ్.