
రౌడీ హీరో వేగం పెంచారు. లాస్ట్ హిట్‌ని జనాలు మర్చిపోకముందే, మరో హిట్ తో పలకరించాలనే తొందర మీదున్నారు రౌడీ హీరో. లవ్‌నీ, ఫ్యామిలీ సబ్జెక్టునీ టచ్ చేసిన ప్రతిసారీ మినిమమ్ గ్యారంటీ సినిమాలను అందుకున్నారు విజయ్ దేవరకొండ. ఇప్పుడు కూడా ఈ సమ్మర్‌కి ఫ్యామిలీస్టార్‌తో పలకరించడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఫైనల్ షూటింగ్ జరుపుకుంటోంది ఈ సినిమా.

ఇప్పటిదాకా తెలుగులో ఫ్లాప్ అందుకోలేదు మృణాల్ ఠాకూర్. ఫ్యామిలీ తరహా సబ్జెక్టులకు ఓ రకంగా బ్రాండ్ అంబాసిడర్‌గా మారిపోయారు మృణాల్ ఠాకూర్. ఇప్పుడు ఫ్యామిలీస్టార్‌తో హ్యాట్రిక్ హిట్ గ్యారంటీ అనే మాట వినిపిస్తోంది మృణాల్ సర్కిల్స్ లో. పరశురామ్ తరహా విట్టీ డైలాగులు కూడా సినిమాకు ప్లస్ అవుతాయన్నది యూనిట్ నుంచి అందుతున్న భరోసా

సీఎం కుర్చీ కోసం రియల్ లైఫ్‌లో అడుగులు వేస్తున్నారు దళపతి విజయ్. అటు స్క్రీన్ మీద మాత్రం కుర్చీలో కూర్చునే ప్రయత్నాలే సాగుతున్నాయి. దళపతి విజయ్ ఆఖరి సినిమాను అట్లీ డైరక్ట్ చేస్తారనే ప్రచారం సాగుతోంది. వీరిద్దరి కాంబినేషన్‌కి ఎప్పుడూ తమిళనాడులో స్పెషల్ క్రేజ్ ఉంటుంది. అలాంటిది విజయ్‌ని అట్లీ సీఎంగా చూపిస్తే చూడ్డానికి రెండు కళ్లూ చాలవని అంటున్నారు దళపతి ఫ్యాన్స్. ఈ సినిమాలో సమంత హీరోయిన్‌గా నటిస్తారనే మాట కూడా వైరల్ అవుతోంది. ఇప్పటికే సబ్జెక్ట్ పూర్తయిందన్నది టాక్. విజయ్ కూడా కథ విని ఓకే చెప్పారట. రియల్ లైఫ్‌లో విజయ్ సీఎం అయితే ఎలాంటి పాలన ఉంటుందో చెప్పడానికి, ఈ సినిమాను బెస్ట్ ఎగ్జాంపుల్‌గా రెడీ చేస్తారన్నది టాక్. ప్రస్తుతం సొసైటీలో ఉన్న విధివిధానాలు, లోటుపాట్లను గురించి అట్లీని డీప్‌గా స్టడీ చేయమని చెప్పారట విజయ్. సో సీఎంగా విజయ్ మూవీ ఎలా ఉంటుందో లెట్స్ వెయిట్ అండ్ సీ.

దళపతి విజయ్ రూట్లో ట్రావెల్ చేయడానికి సూర్య సన్నాహాలు చేసుకుంటున్నారా? ఈ ప్రశ్నకు పర్ఫెక్ట్ గా ఇదే ఆన్సర్ అని ఎవరూ చెప్పలేకపోవచ్చు. దీనికి సంబంధించి ఎవరి ఊహలు వారివన్నమాట. ఇప్పుడు ఉన్నట్టుండి సూర్యకి, విజయ్‌కీ పోలిక ఎందుకు వచ్చిందని అంటున్నారా? దానికీ ఓ రీజన్ ఉంది. ఇటీవల తమిళనాడులో తుఫాను భీభత్సం సృష్టించింది. ఆ సమయంలో గ్రౌండ్‌లోకి దిగి, ప్రజలకు సాయం చేసిన తన అభిమానులను పిలిచి భోజనం పెట్టారు సూర్య.

అందరికీ స్వయంగా వడ్డించడమే కాకుండా, చిరునవ్వుతో అందరితోనూ ఫొటోలు తీసుకున్నారు. ప్రస్తుతం సేవా సంస్థలుగా ఉన్న ఫ్యాన్స్ అసోసియేషన్స్ భవిష్యత్తులో పార్టీలుగా మారడాన్ని గమనిస్తున్నాం. విజయ్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఇప్పుడు ఆయన పార్టీలో మమేకమైంది . దీన్ని బట్టి సూర్యకి కూడా భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనలు ఉన్నాయా? అనే చర్చలు జరుగుతున్నాయి.