
యూ ట్యూబ్‌లో షార్ట్ ఫిల్మ్స్ చేసుకునే స్థాయి నుంచి.. నిర్మాతలు నమ్మే మినిమమ్ గ్యారెంటీ హీరోగా ఎదగడమంటే చిన్న విషయం కాదు. దాన్ని చేసి చూపించారు సుహాస్.

కమెడియన్ నుంచి కారెక్టర్ ఆర్టిస్ట్.. ఇప్పుడు హీరోగా వరస సినిమాలు చేస్తున్నారు సుహాస్. అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ తర్వాత వచ్చిన జనక అయితే గనక, ప్రసన్న వదనం, శ్రీరంగనీతులు అంతగా ఆడలేదు.

మామూలుగా కమెడియన్ హీరోగా మారితే.. అతన్నుంచి కామెడీ సినిమానే ఊహిస్తాం. కానీ సుహాస్ మాత్రం కలర్ ఫోటో నుంచే విభిన్నంగా ట్రై చేస్తున్నారు. మొన్న జులై 4న కీర్తి సురేష్‌తో కలిసి ఈయన నటించిన ఉప్పు కప్పురంబు ఓటిటిలో విడుదలైంది.

వచ్చే వారం.. అంటే జులై 11న కూడా ఈయన నటిస్తున్న ఓ భామ అయ్యో రామా థియేటర్‌లో విడుదల కాబోతుంది. చిత్రలహరి టాకీస్, V ఆర్ట్స్ బ్యానర్స్‌పై ప్రదీప్ రెడ్డి, హరీష్ నల్లా సంయుక్తంగా సుహాస్ సినిమాను నిర్మిస్తున్నారు.

మాళవిక మనోజ్ హీరోయిన్‌గా పరిచయం అవుతున్నారు. కెరీర్‌లో తొలిసారి పూర్తిస్థాయి కలర్ ఫుల్ లవ్ స్టోరీలో నటించారు సుహాస్. ట్రైలర్ కూడా చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంది. జులై 11న పోటీ లేకపోవడంతో.. ఆ గ్యాప్ క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు ఈ నటుడు.