
శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ సింగిల్. అల్లు అరవింద్ సమర్పణలో విద్య కొప్పినీడు, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మిస్తున్న ఈ సినిమా మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్ స్పీడు పెంచిన యూనిట్ సోమవారం జరిగిన ఈవెంట్‌లో ట్రైలర్‌ను లాంచ్ చేశారు.

జగదేక వీరుడు అతిలోక సుందరి రీ రిలీజ్‌ను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేస్తున్నారు మేకర్స్. స్ట్రయిట్ రిలీజ్‌లో మే 9న రిలీజ్ అయిన ఈ మూవీని ఇప్పుడు కూడా అదే డేట్‌కు విడుదల చేస్తున్నారు. ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్, సినిమా ఎలా సెట్స్ మీదకు వచ్చిందన్న విషయాన్ని రివీల్ చేస్తూ వీడియో రిలీజ్ చేశారు.

రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ స్పీడు పెంచింది కింగ్‌డమ్ టీమ్. ఈ నెల 30న తొలి సింగిల్ ప్రోమోను రిలీజ్ చేయబోతున్నట్టుగా వెల్లడించారు. విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా మే 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్.

థగ్ లైఫ్ సినిమా ప్రమోషన్‌ను డిఫరెంట్‌గా ప్లాన్ చేసింది చిత్రయూనిట్. థగ్స్ టాక్ పేరుతో ప్రతీ రోజు ఓ ఎపిసోడ్‌ను రిలీజ్ చేయబోతున్నట్టుగా వెల్లడించింది. ప్రతి రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఎపిసోడ్‌ను రిలీజ్ చేయబోతున్నారు. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో కమల్ హాసన్, శింబు, త్రిష కీలక పాత్రల్లో నటించారు.

బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ గురునానక్ పాత్రలో నటించబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన టీమ్ ఖండించింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో ఏఐ జనరేటెడ్ అని తెలిపింది. ఆమిర్ ప్రస్తుతం సితారే జమీన్ పర్ సినిమా మాత్రమే చేస్తున్నారని, కొత్త సినిమాకు సంబంధించిన అప్‌డేట్ ఉంటే అఫీషియల్ పేజెస్‌లో ప్రకటిస్తామన్నారు.