
శ్రీదేవి విజయ్ కుమార్.. తెలుగు సినీప్రియులకు పరిచయం అక్కర్లేని హీరోయిన్. ఒకప్పుడు తెలుగులో విపరీతమైన క్రేజ్ ఉన్న హీరోయిన్. ప్రభాస్ హీరోగా పరిచయం అయిన సినిమా ఈశ్వర్. ఇందులో కథానాయికగా శ్రీదేవి విజయ్ కుమార్ కథానాయికగా నటించింది.

ఫస్ట్ మూవీతోనే అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత తెలుగులో నిరీక్షణ సినిమాతో మరోసారి సినీప్రియులను మెప్పించింది. కానీ ఈ బ్యూటీకి అంతగా అవకాశాలు రాలేదు. దీంతో తమిళంలో వరుస సినిమాలు చేస్తూ అక్కడే సెటిల్ అయ్యింది.

కెరీర్ మంచి పీక్స్ లో ఉండగానే రాహుల్ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది. వీరికి 2006లో రూపిక అనే పాప జన్మించింది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న శ్రీదేవి.. వీర సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగులో మరో సినిమా చేయలేదు.

ఇక ఇప్పుడు నారా రోహిత్ నటిస్తున్న సుందరకాండ సినిమాలో కథానాయికగా కనిపించనుంది. అలాగే బుల్లితెరపై పలు రియాల్టీ షోలలో జడ్జీగా వ్యవహరిస్తుంది. ఇదిలా ఉంటే.. తాజాగా సోషల్ మీడియాలో శ్రీదేవి విజయ్ కుమార్ షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.

ప్రస్తుతం ఆమె వయసు 38 సంవత్సరాలు. ఇప్పటికీ ఏమాత్రం తగ్గని అందంతో కుర్రహీరోయిన్లకు గట్టిపోటీ ఇస్తుంది. శ్రీదేవి ఫిట్నెస్ రహాస్యం నిత్యం వ్యాయమం, యోగా, వర్కవుట్స్ చేయడమే అని.. అలాగే ఇంటి భోజనం, ఆకుకూరలు తీసుకోవడమని గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.