
దేవర సినిమాతో సోలోగా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అందుకున్నారు ఎన్టీఆర్. రెండు భాగాలుగా ప్లాన్ చేసిన ఈ సినిమాలో తొలి భాగం ఘన విజయం సాధించటంతో సీక్వెల్ మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

అందుకే స్క్రిప్ట్ నుంచి మేకింగ్ వరకు ప్రతీ విషయంలోనూ పార్ట్ 2 విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. దేవర జపాన్ ప్రమోషన్స్ సందర్భంగా సీక్వెల్ గురించి కూడా మాట్లాడారు తారక్.

పార్ట్ 2లో ప్రేక్షకులు ఊహించని సర్‌ప్రైజ్‌లు చాలా ఉంటాయన్నారు. అంతేకాదు, తొలి భాగంలో దేవర గురించి తెలుసుకున్నారు, సీక్వెల్‌లో వర కథ చూడబోతున్నారని చెప్పారు.

అదే సమయంలో దేవరకు ఏం జరిగింది అన్నది కూడా సీక్వెల్‌లో రివీల్ చేస్తామని చెప్పారు.తొలి భాగం కథ, యతి అనే వ్యక్తి కోసం పోలీసులు వెతకటంతో ప్రారంభమైంది. కానీ క్యారెక్టర్ చూపించకుండానే పార్ట్ 1 ను ముగించారు.

సీక్వెల్‌లో యతి క్యారెక్టరే కీలకంగా కనిపించనుంది. కొన్ని కొత్త క్యారెక్టర్స్ కూడా పార్ట్ 2లో పలకరించబోతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. తొలి భాగం సూపర్ హిట్ కావటంతో సీక్వెల్ మీద భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఆ అంచనాలను అందుకునే రేంజ్‌లో కథను మరింత ఫైన్ ట్యూన్ చేస్తున్నారు కెప్టెన్ కొరటాల.