
ఘాటి సినిమా మీద చాలా చాలా హోప్స్ పెట్టుకున్నారు డైరక్టర్ క్రిష్. అంతకన్నా ఎక్కువగానే సినిమా సక్సెస్‌ని ఆకాంక్షించారు అనుష్క. అయితే అనుకున్నదొకటి.. అయిందొకటి. సినిమా ఆశించినంతగా క్లిక్ కాలేదు. అందుకే ఇప్పుడు మలయాళ కథనార్ మీదే ఆశలన్నీ అంటున్నారు స్వీటీ శెట్టి.

ఇటు అనుపమ పరమేశ్వరన్‌కి కూడా రీసెంట్ మూవీ పరదా ఏమాత్రం ఆనందాన్నివ్వలేకపోయింది. బంపర్ హిట్ అవుతుందనుకున్న సినిమా బోల్తా పడేసరికి కాసింత డిసప్పాయింట్ అయ్యారు అనుపమ. అయినా బౌన్స్ బ్యాక్ అవుతున్నారు కిష్కిందపురి ప్రమోషన్స్ లో. ఎలాగైనా ఈ సినిమా సూపర్ సక్సెస్ అవుతుందన్నది అనుపమ మాట.

ఈ ఏడాది మీద బోలెడంత నమ్మకం పెట్టుకున్న హీరోయిన్లలో నిధి అగర్వాల్ ఒకరు. ఆమె నటించిన హరిహరవీరమల్లు విడుదలైంది. తార తార అంటూ నిధి అగర్వాల్ గ్లామర్‌తో మెప్పించే ప్రయత్నం చేసినా సినిమాకు అది ఏమాత్రం ప్లస్ కాలేదు.

ఆమె కెరీర్‌కి కూడా హరిహరవీరమల్లు పెద్దగా తళుకులు అద్దలేకపోయింది. మన సినిమాలే కాదు.. నార్త్ లోనూ నెక్స్ట్ సినిమాల సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నవాళ్లు బాగానే కనిపిస్తున్నారు.

ఆల్ఫా కోసం ఆలియా అలాగే వెయిట్ చేస్తున్నారు. సన్నీ సంస్కారీ కి తులసి కుమారి కోసం జాన్వీ కూడా అంతే ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. రానున్న సినిమాలైనా తమ అభిమాన హీరోయిన్లకు బంపర్ హిట్ కావాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్.