- Telugu News Photo Gallery Cinema photos Small films are creating wonders as blockbusters in Mollywood film industry
Malayalam Movies: మాలీవుడ్‌లో చిన్న సినిమాలు వండర్స్.. స్టార్ హీరోలకు షాక్స్..
మాలీవుడ్‌లో చిన్న సినిమాలు వండర్స్ క్రియేట్ చేస్తున్నాయి. ఎలాంటి స్టార్ పవర్ లేకపోయినా... ఏ మాత్రం అంచనాలు లేకపోయినా... భారీ వసూళ్లతో సత్తా చాటుతున్నాయి. ఈ సినిమా జోరు స్టార్ హీరోలకు కూడా షాక్ ఇస్తోంది.ఇప్పటి వరకు మాలీవుడ్‌లో బిగ్గెస్ట్ హిట్ మూవీ లూసీఫర్. సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా మరో టాప్ హీరో పృథ్వీరాజ్ సుకుమార్ గెస్ట్ రోల్‌లో నటించి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఘన విజయం సాధించింది.
Updated on: Mar 13, 2024 | 11:31 AM

ఇప్పటి వరకు మాలీవుడ్‌లో బిగ్గెస్ట్ హిట్ మూవీ లూసీఫర్. సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా మరో టాప్ హీరో పృథ్వీరాజ్ సుకుమార్ గెస్ట్ రోల్‌లో నటించి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఘన విజయం సాధించింది. ఈ మూవీ ఫుల్ రన్‌లో 127 కోట్ల వసూళ్లు సాధించింది.

మోహన్‌లాల్ సినిమా సెట్ చేసిన రికార్డును ఓ చిన్న సినిమా చెరిపేసింది. ఇటీవల మలయాళీ ఆడియన్స్ ముందుకు వచ్చిన సర్వైవల్ థ్రిల్లర్ మంజుమెల్ బాయ్స్ చిన్న సినిమాగా వచ్చి ఎవ్వరు ఉహించని విధంగా సంచలన విజయం సాధించింది.

ఫిబ్రవరి 22న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మంజుమెల్ బాయ్స్, 16 రోజుల్లోనే 130 కోట్ల వసూళ్లు సాధించింది. ఇంకా హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో రన్ అవుతుండటంతో ఈ సినిమా 150 కోట్ల మార్క్‌ను కూడా రీచ్ అవ్వటం పక్కా అంటున్నారు ఇండస్ట్రీ జనాలు.

మంజుమెల్ బాయ్స్ కన్నా వారం ముందు మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి లీడ్ రోల్‌లో నటించిన భ్రమయుగం సినిమా రిలీజ్ అయ్యింది. ఎక్స్‌పరిమెంటల్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సినిమాకు కూడా సూపర్ హిట్ టాక్ వచ్చింది. అయినా ఈ మూవీ 100 కోట్ల వసూళ్ల మార్క్‌ను టచ్ చేయలేకపోయింది

రీసెంట్‌గా రిలీజ్ అయిన మరో మాలీవుడ్ మూవీ కూడా స్టార్ హీరోలకు షాక్ ఇచ్చింది. రొమాంటిక్ కామెడీగా తెరకెక్కిన ప్రేమలు సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. 3 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా 100 కోట్ల మార్క్‌ను క్రాస్ చేసి బిగ్గెస్ట్ ఎవ్వర్ హిట్స్ సరసన నిలిచింది. రీసెంట్‌గా తెలుగులోనూ రిలీజ్ అయిన ఈ సినిమాకు ఇక్కడ కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది.




