
రీసెంట్ టైమ్స్‌లో తెలుగు, తమిళ్ అన్న తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలు కవర్ చేస్తున్నారు ఎస్‌జే సూర్య. ముఖ్యంగా టాప్ హీరోల సినిమాల్లో విలన్ అంటే సూర్యనే ఫస్ట్ ఛాయిస్‌గా కనిపిస్తున్నారు.

ప్రజెంట్ సెట్స్ మీద ఉన్న దాదాపు అరడజను సినిమాల్లో విలన్ రోల్స్ చేస్తున్నారు ఈ వర్సటైల్ స్టార్. కెరీర్‌లో ఇంత బిజీగా ఉన్న టైమ్‌లో బిగ్ డెసిషన్ తీసుకున్నారు ఎస్ జే సూర్య.

విలన్ రోల్స్‌తో పాటు అడపాదడపా హీరోగానూ నటిస్తున్న సూర్య, ఇక మీదట పూర్తిగా లీడ్ రోల్సే చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకే క్రేజీ ప్రాజెక్ట్స్ వస్తున్నా... వాటికి ఓకే చెప్పటం లేదు.

ఇప్పటికే విలన్‌గా చాలా సినిమాలు చేయటంతో బోర్ ఫీలింగ్ వచ్చేసిందని అందుకే రూటు మారుస్తున్నట్టుగా చెప్పారు ఈ సీనియర్ నటుడు. రీసెంట్‌గా విజయ్ సేతుపతి కూడా ఇలాంటి డెసిషనే తీసుకున్నారు.

జవాన్ రిలీజ్ తరువాత ఇక మీదట విలన్ రోల్స్ చేయనని చెప్పేశారు. హీరో, విలన్ అన్నట్టు కాకుండా.. కథ డిమాండ్ చేసి తన పాత్ర లీడ్ అయితే నెగెటివ్ షేడ్స్ ఉన్నా చేస్తా అంటూ ట్విస్ట్ ఇచ్చారు. సూర్య మాత్రం కొద్ది రోజులు నెగెటివ్ రోల్స్‌కు పూర్తిగా దూరంగానే ఉండాలని ఫిక్స్ అయ్యారు.