
సిద్దూ జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ జాక్. ఈ సినిమాలో కామెడీ స్పైగా డిఫరెంట్ రోల్‌లో కనిపించబోతున్నారు ఈ యంగ్ హీరో. మిషన్ బటర్‌ఫ్లై కోసం యాక్షన్‌తో పాటు కామెడీని కూడా బ్లెండ్ చేసి చూపించబోతున్నారు.

ట్రైలర్ పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసినా... ఈ సినిమా జానర్ మీద అనుమానాలు మాత్రం కంటిన్యూ అవుతున్నాయి.రీసెంట్ టైమ్స్‌లో స్పై థ్రిల్లర్‌లు పెద్దగా వర్కవుట్ కాలేదు.

అందులోనూ కామెడీ మిక్స్ చేసిన స్పై థ్రిల్లర్లు దారుణంగా ఫెయిల్ అయ్యాయి. ఏజెంట్, రాజా విక్రమార్క సినిమాల విషయంలో ఇదే జరిగింది. కాస్త సీరియస్ నోట్‌లో చేసిన చాణక్య కూడా నిరాశపరిచింది.

సక్సెస్ ట్రాక్‌లో ఉన్న సిద్ధూ జొన్నలగడ్డ ఇలా ఫెయిల్యూర్ జానర్‌ను పిక్ చేసుకోవటంతో ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. సిద్దూ బాడీ లాంగ్వేజ్‌కు పర్ఫెక్ట్‌గా సూట్ అయ్యే కథా కథనాలే అయినా... ఓవరాల్‌గా ఆ సినిమా ఆడియన్స్‌ను ఎంత వరకు మెప్పిస్తుంది అన్న విషయంలో టెన్షన్ కనిపిస్తోంది.

మరి ఈ అనుమానాలకు సిద్ధూ చెక్ పెడతారా..? లేదంటే తాను కూడా సెంటిమెంట్‌ను కంటిన్యూ చేస్తూ నిరాశపరుస్తారా.? లెట్స్ వెయిట్ అండ్ సీ.