
హిట్ వచ్చినా.. ఫ్లాప్ వచ్చినా నా జోరు మాత్రం నాదే అంటున్నారు శర్వానంద్. 2022లో ఒకే ఒక జీవితంతో హిట్ కొట్టిన తర్వాత.. రెండేళ్ళు గ్యాప్ తీసుకున్నారు. మొన్నీమధ్యే మనమే అంటూ వచ్చినా లాభం లేదు. శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించిన ఈ చిత్రం ఆకట్టుకోలేదు. అయినా కూడా ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీగా ఉన్నారు శర్వానంద్.

శర్వా 35 సెట్స్‌పై ఉండగానే.. 36, 37 కూడా కన్ఫర్మ్ అయిపోయాయి. ఇక ఈ మధ్యే 38వ సినిమాను కూడా ఓకే చేసారు ఈ హీరో. సంపత్ నంది దర్శకత్వంలో ఇది తెరకెక్కుతుంది ఈ యంగ్ హిరో.

ఇదిలా ఉంటే శర్వా 36ను అభిలాష్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను యువీ క్రియేషన్స్ నిర్మిస్తున్నారు. ఇక సామజవరగమనా ఫేమ్ రామ్ అబ్బరాజుతో శర్వా 37 వస్తుంది. వీటి గురించి మరన్ని విషయాలు త్వరలో వెల్లడించనున్నారు.

రెండు సినిమాలు సెట్స్‌పై ఉండగానే.. సంపత్ నంది ప్రాజెక్ట్ ఓకే చేసారు శర్వా. తాజాగా ఈ చిత్ర అప్‌డేట్ వచ్చింది. 1960ల నేపథ్యంలో సాగే కథ ఇది. ఈ సినిమా షూటింగ్ సన్నాహాలు సాగుతున్నాయి.

ఈ సినిమా కోసం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 15 ఎకరాల స్థలంలో భారీ సెట్ నిర్మాణం జరుగుతుంది. అక్కడే మేజర్ పార్ట్ షూట్ చేయబోతున్నారు సంపత్ నంది. భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం రూపొందుతుంది.