
ఇంతకీ ఏంటి ఆ ఫార్ములా? మరి నయా ట్రెండ్ శర్వాకు సక్సెస్ ఇస్తుందా? ఈ స్టోరీలో చూద్దాం. మాస్ కమర్షియల్ డైరెక్టర్ సంపత్ నంది తన స్టైల్ మార్చి శర్వానంద్ హీరోగా ఓ సినిమా చేస్తున్నారు.

హారర్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమా కోసం ఓ తెలుగు పండగ పేరును టైటిల్ గా ఫిక్స్ చేశారు. అయితే రీసెంట్ టైమ్స్ లో అలనా పండగల పేర్లతో వచ్చిన సినిమాలు బ్లాక్ బస్టర్ కావడంతో ఈ సినిమాకు కూడా అదే సెంటిమెంట్ వర్క్ అవుతుందన్న నమ్మకంతో ఉంది టీం.

నాని హీరోగా తెరకెక్కిన పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ మూవీ దసరా. తన ఇమేజ్ కు పూర్తి భిన్నంగా నాని చేసిన ఈ ప్రయోగం సిల్వర్ స్క్రీన్ మీద కాసులు కురిపించింది.

వంద కోట్ల క్లబ్ లో స్థానం సంపాదించడంతో పాటు నానిని పాన్ ఇండియా స్టార్ గా నిలబెట్టింది. ఈ ఏడాది సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్నాం కూడా బ్లాక్ బస్టర్ అయింది.

వెంకీ అనిల్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఎవ్వరూ ఊహించని విధంగా వంద కోట్ల మార్కును క్రాస్ చేసింది. దీంతో పండగ టైటిల్స్ మీద పాజిటివ్ వైబ్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు శర్వా విషయంలోనూ ఇదే మ్యాజిక్ రిపీట్ అవుతుందన్న నమ్మకంతో ఉంది యూనిట్.