Ramoji Rao Death: వ్యక్తి నుంచి ఓ వ్యవస్థగా ఎదిగిన అక్షర యోధుడికి అశ్రునివాళి
ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ చెరుకూరి రామోజీరావు కన్నుమూశారు. మూడు రోజుల క్రితం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో ఆయన్ని ఆసుపత్రిలో చేర్చారు. రామోజీ గ్రూప్‌లో ఈనాడు మీడియా, మార్గదర్శి చిట్‌ఫండ్స్, ప్రియా ఫుడ్స్, ఉషాకిరణ్ మూవీస్, రామోజీ ఫిల్మ్‌సిటీ, కళాంజలి, బ్రిసా షోరూమ్స్ వంటి సంస్థలున్నాయి. తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని ముద్రవేశారు రామోజీరావు.