
తెలుగు ప్రేక్షకుల క్యూట్ బ్యూటీ, సంయుక్త మీనన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ అమ్మడు సొంతం. తన గ్లామర్‌తో ఈ చిన్నది ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది.

ఒక్కసినిమాతోనే టాలీవుడ్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఈ అమ్మడు, తెలుగు, తమిళం, ఇలా అన్ని భాషల్లో సినిమాలు చేస్తూ తన అందం, నటనతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లానాయక్ సినిమాతో తెలుగు వెండితెరకు పరిచయం అయ్యింది ఈ చిన్నది.

ఈ మూవీతోనే మంచి క్రేజ్ సంపాదించుకోవడమే కాకుండా, తెలుగు అభిమానుల మనసు దోచుకుని మంచి ఫ్యాన్ బేస్ సొంతం చేసుకుంది. ఇక ఈ మూవీ తర్వాత వరసగా, బింబిసార, విరూపాక్ష, సార్ , డేవిల్ వంటి సినిమాల్లో నటించి, వరసగా హిట్స్ అందుకుంది. దీంతో టాలీవుడ్ లక్కీ హీరోయిన్‌గా మారిపోయింది.

మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ చిన్నది, వరసగా హిట్స్ అందుకొని మంచి ఫామ్‌లో ఉంది. ప్రస్తుతం ఈ బ్యూటీ అరడజన్‌కు పైగా సినిమాలతో ఫుల్ బిజీగా గడిపేస్తున్నట్లు తెలుస్తుంది.

ఇక ఓ వైపు సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, ఏ కాస్త సమయం దొరికినా చాలు ఈ బ్యూటీ నెట్టింట యాక్టివ్‌గా ఉంటూ, తన క్యూట్ ఫొటోస్‌తో ఆకట్టుకుంటుంది. తాజాగా ట్రెండీ డ్రెస్‌లో తన అందంతో అందరినీ తన వైపుకు తిప్పుకుంది.