Salman Khan: సల్మాన్‌కు ఇంతకంటే అవమానం ఉంటుందా..?

Edited By: Phani CH

Updated on: Mar 29, 2025 | 1:46 PM

స్టార్ హీరోల సినిమాలొస్తే.. ఒక్క టికెట్ ఇప్పించండ్రా బాబూ.. డబ్బులు ఎంతైనా పర్వాలేదు అంటుంటారు అభిమానులు. కానీ బాలీవుడ్‌లో మాత్రం పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఓ స్టార్ హీరో సినిమా విడుదలైతే కనీసం ఓపెనింగ్స్ లేవు. అందుకే బై వన్ గెట్ వన్ ఫ్రీ అంటున్నారు.. ఆ మధ్య ఓ హీరో ఫ్రీగా సమోసాలిస్తాం.. తోడుగా ఛాయ్ ఇస్తాం అన్నారు. అసలేంటి పరిస్థితి.. ఎవరా హీరో..?

1 / 5
ఒకప్పుడు బాలీవుడ్‌లో తిరుగులేని విజయాలు అందుకున్న సల్మాన్ ఖాన్‌కు ఇప్పుడు బ్యాడ్ టైమ్ నడుస్తుంది. ఒకప్పట్లా ఆయన సినిమాలకు ఓపెనింగ్స్ లేవు.. వసూళ్లు లేవు. కొన్నిసార్లు సినిమాలు వచ్చినట్లు కూడా ఐడియా లేదు.

2 / 5
తాజాగా సల్మాన్ నటించిన సికిందర్ మార్చి 30న విడుదలవుతుంది. మురుగదాస్ తెరకెక్కించిన ఈ సినిమాకు బంపర్ ఆఫర్ ఇస్తున్నారు టికెట్ బుకింగ్ యాప్స్.

3 / 5
సల్మాన్ లాంటి సూపర్ స్టార్ సినిమా టికెట్స్ కోసం ఆడియన్స్ ఎగబడాలి.. కానీ అలా జరగట్లేదిప్పుడు. అసలు మ్యాటర్ ఏంటంటే సికందర్ ఫస్ట్ డే చూడ్డానికి కూడా కొన్ని టికెట్ యాప్స్‌లో 150 రూపాయలు కూపన్ ఇచ్చారు.

4 / 5
రెండు టికెట్లు కొంటే ఈ కూపన్ వాడొచ్చు. అంటే బై వన్ గెట్ వన్ ఫ్రీ అన్నమాట. సల్మాన్ రేంజ్‌కు కూడా ఇలాంటి జిమ్మిక్కులు చేస్తే గానీ జనం రావట్లేదు. ఆ మధ్య అక్షయ్ కుమార్ సర్‌ఫిరా సినిమాకు వస్తే.. ఒక టికెట్‌పై రెండు సమోసాలతో పాటు ఒక టీ ఉచితంగా ఇస్తామని ప్రకటించాయి పివిఆర్ ఐనాక్స్ సంస్థలు.

5 / 5
మల్టీప్లెక్స్‌లలో ఓ టీ, 2 సమోసా అంటే వందల్లో మ్యాటర్. కానీ ఇచ్చారు ఆ సినిమా కోసం. ఎంతైనా సల్మాన్, అక్షయ్ లాంటి స్టార్ హీరోల సినిమాలకు ఈ దుస్థితి రావడం నిజంగా దారుణమైన విషయమే.