మెగాస్టార్ చిరంజీవి హీరోగా నెక్స్ట్ సినిమా పనులు మొదలయ్యాయి. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు మేకర్స్. చిరంజీవి హీరోగా బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయని చెప్పారు వశిష్ట.
ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న సలార్ సినిమా సెప్టెంబర్ 28 నుంచి వాయిదా పడిన విషయం తెలిసిందే. దాంతో అదే రోజు రావడానికి చాలా సినిమాలు పోటీ పడుతున్నాయి. ఇదిలా ఉంటే సలార్ నవంబర్ 10న విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ పూర్తవ్వగా.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి.
వైష్ణవ్ తేజ్, శ్రీ లీల జంటగా శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న సినిమా ఆదికేశవ. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది. తాజాగా ఈ సినిమా నుంచి మొదటి సాంగ్ విడుదలైంది. జీవి ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమా సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. త్వరలోనే సినిమా విడుదల కానుంది.
వెంకటేష్ కథానాయకుడిగా నటించిన సినిమా సైంధవ్. నీహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రూపొందుతోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శ్రీలంకలో జరుగుతోంది. డిసెంబర్ 22న విడుదల కానుంది సైంధవ్. దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ విడుదల చేయనున్నారు.
ఫలితంతో పనిలేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నారు హీరో గోపీచంద్. తాజాగా దర్శకుడు శ్రీను వైట్లతో ఈయన సినిమా ఓపెనింగ్ జరిగింది. హైదరాబాద్‌లో జరిగిన ఈ చిత్రం ముహూర్తానికి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సహా చాలా మంది ప్రముఖులు హాజరయ్యారు. ప్రముఖ నిర్మాత నవీన్ యెర్నేని కెమెరా స్విచాన్ చేశారు. గోపీచంద్ ఈ సినిమాలో కొత్త లుక్కుతో కనిపించనున్నారు.