
ఫిదా సినిమాతోనే జనాలను మెప్పించారు సాయిపల్లవి. ఆ సినిమాలో ఆమె తెలంగాణ శ్లాంగ్ మాట్లాడుతుంటే ఫిదా అయిపోయారు జనాలు. పక్కా తెలంగాణ పల్లె పిల్లగా ఆమె నటనను చూసి భానుమతి నిజంగానే సింగిల్ పీస్ అనుకున్నారు.

రానాతో నటించిన విరాటపర్వంలోనూ తెలంగాణ యాసను ఇరగదీశారు సాయిపల్లవి. రవన్నను వెతుక్కుంటూ వెళ్లే అమ్మాయిగా సూపర్బ్ అనిపించుకున్నారు. నచ్చినవాడి కోసం ఊరూ వాడా దాటి వెళ్లిన ఆమె కేరక్టర్ ఇంకా జనాల గుండెల్లో మెదులుతూనే ఉంది.

కొంతకాలంగా సినిమాలకు కాస్త దూరంగానే ఉన్న పల్లవి రీసెంట్‌గా అమరన్‌తో సందడి చేశారు. స్క్రీన్ మీద ఆమె నటించారా? జీవించేశారా? అన్నంతగా మెస్మరైజ్ అయ్యారు జనాలు.

ఉత్తరాంధ్ర బిడ్డగా నటించిన తండేల్ వచ్చే ఏడాది పలకరించనుంది. మరో వైపు ఆమె పక్కా తెలంగాణ సబ్జెక్టుతో రూపొందనున్న ఎల్లమ్మ అనే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే మాటలు వినిపిస్తున్నాయి.

బలగం ఫేమ్ వేణు దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కనున్నట్టు టాక్. ఈ వార్త నిజమైతే మన రౌడీ బేబీ మరోసారి తెలంగాణ వీధుల్లో హల్‌చల్ చేయడం గ్యారంటీ అన్నమాట.