- Telugu News Photo Gallery Cinema photos Sai Pallavi beats Nayanthara and Trisha in number of Filmfare awards received, check how many she got
Sai Pallavi: ఆ విషయంలో స్టార్ హీరోయిన్స్‌ను బీట్ చేసిన సాయి పల్లవి
సహజ నటి సాయి పల్లవి క్రేజ్ రోజు రోజుకు పెరిగిపోతుంది. ఈ ముద్దుగుమ్మ సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన సాయి పల్లవి తన నటనతో మన తెలుగమ్మాయిగా మారిపోయింది.
Updated on: Jul 18, 2024 | 3:10 PM

సహజ నటి సాయి పల్లవి క్రేజ్ రోజు రోజుకు పెరిగిపోతుంది. ఈ ముద్దుగుమ్మ సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన సాయి పల్లవి తన నటనతో మన తెలుగమ్మాయిగా మారిపోయింది.

వైవిధ్యమైన పాత్రలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. చాలా మంది హీరోయిన్స్ తమ గ్లామర్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంటే సాయి పల్లవి మాత్రం అలా కాకుండా పద్దతిగా నటిస్తూ అభిమానులను సొంతం చేసుకుంటుంది.

సినిమాల ఎంపికలోనూ ఈ బ్యూటీ చాలాజాగ్రత్తలు తీసుకుంటుంది. కథ కథనంతో పాటు నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తూ లేడీ పవర్ స్టార్ గా పేరు తెచ్చుకుంది. తాజాగా స్టార్ హీరోయిన్స్ కు కూడా సాధ్యంకాని రికార్డ్ ను సొంతం చేసుకుంది సాయి పల్లవి.

10 సార్లు ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ కు నామినేట్ అయిన సాయి పల్లవి 6 సార్లు ఉత్తమ నటి అవార్డును గెలుచుకుంది. స్టార్ హెహీరోయిన్స్ త్రిష 5, నయనతార 5 అవార్డులు మాత్రమే గెలుచుకున్నారు. ఈ ఇద్దరిని సాయి పల్లవి బీట్ చేసింది.

ఫిదా సినిమా మొదలుకొని చివరిగా వచ్చిన విరాటపర్వం సినిమా వరకు సాయి పల్లవి అద్భుతమైన నటనను కనబరిచినిది. ప్రస్తుతం ఈ బ్యూటీ తండేల్ అనే సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.




