
తను చేసిన సినిమాల్లో రాజమౌళి బెస్ట్ మూవీ ఏదై ఉంటుందనుకుంటున్నారు. ఆస్కార్ సాధించింది కాబట్టి ట్రిపులార్, పాన్ ఇండియా గేట్స్ ఓపెన్ చేసింది కాబట్టి బాహుబలి లాంటి సినిమాలు ఉండొచ్చని అనుకుంటాం.

లేదంటే తన ఫస్ట్ మూవీ స్టూడెంట్ నెంబర్ వన్, ఫస్ట్ బ్లాక్ బస్టర్ సింహాద్రి పేరు చెబుతారు అనుకుంటాం... కానీ జక్కన్న మాత్రం ఈ అంచనాలను తారుమారు చేశారు. జూనియర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న జక్కన్న తన ఫిల్మోగ్రఫిలో తన బెస్ట్ మూవీ ఏంటో రివీల్ చేశారు.

ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్స్ ఇచ్చిన రాజమౌళికి ఎంతో నచ్చిన సినిమా ఈగ. యస్... అప్పటి వరకు తెలుగు తెర మీద ఎవరు చేయని ప్రయోగం, ఓ ఇన్‌సెక్ట్‌ను హీరోగా పెట్టి సినిమా తీసి హిట్ కొట్టారు రాజమౌళి. అందుకే ఆ మూవీనే తన బెస్ట్ అంటున్నారు.

తన కెరీర్‌లోనే కాదు... తెలుగు సినిమా హిస్టరీలో అతి పెద్ద ప్రయోగం కాబట్టి ఆ సినిమా తన బెస్ట్ అంటున్నారు జక్కన్న. అంతేకాదు, ప్రజెంట్ రాజమౌళి తెరకెక్కిస్తున్న విజువల్స్ వండర్స్‌కు ఇన్‌స్పిరేషన్ కూడా ఈగ మేకింగ్ ద్వారానే వచ్చింది. అందుకే ఆ సినిమా బెస్ట్ అంటూ ఓపెన్ అయ్యారు.

జక్కన్న, ఈగ సినిమా తన బెస్ట్ అని చెప్పటం వెనుక మరో రీజన్ కూడా ఉంది. టాప్ స్టార్స్‌తో చేసిన సినిమాల్లో ఏ మూవీ పేరు చెప్పినా, మిగతా వాళ్లు హర్ట్ అవుతారు. అందుకే ఈగ హీరోగా కనిపించిన సినిమా పేరు చెప్పి ఎవరూ హర్ట్ అవ్వకుండా జాగ్రత్త పడ్డారు.