
రుక్మిణి వసంత్.. నిన్నటి వరకు కేవలం కన్నడలో మాత్రమే ఎక్కువగా వినిపించిన పేరు. ఇప్పటికే అక్కడ సప్త సాగరాలు దాటి, బఘీరా లాంటి సినిమాలతో స్టార్ అయిన ఈ బ్యూటీ.. ఇప్పుడు తమిళ, తెలుగుపై కూడా ఫోకస్ చేసారు.

సెప్టెంబర్ 5న ఈమె నటించిన మదరాశి విడుదల కానుంది. శివకార్తికేయన్ ఇందులో హీరోగా నటించారు. రాబోయే 8 నెలల్లో రుక్మిణి నుంచి 4 ప్యాన్ ఇండియన్ సినిమాలు రానున్నాయి.

అందులో మదరాశి ఈ వారంలోనే రానుంది. ఇక అక్టోబర్ 2న కాంతార ఛాప్టర్ 1తో రాబోతున్నారు రుక్మిణి. రిషబ్ శెట్టి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు ఎలా ఉన్నాయనేది చెప్పాల్సిన పనిలేదు.

కాంతార 2లో కనకవతి పాత్రలో నటిస్తున్నారు ఈ బ్యూటీ.2026 ఫస్టాఫ్‌లోనూ రుక్మిణి హవానే కనిపించబోతుంది. మార్చి 19న యశ్ టాక్సిక్.. జూన్ 25న ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ డ్రాగన్‌తో రానున్నారు.

వీటితో పాటు విక్రమ్ తనయుడు ధృవ్ నెక్ట్స్ సినిమాలో రుక్మిణి పేరు వినిపిస్తుంది. మొత్తానికి మరో మీనాక్షి చౌదరి, శ్రీలీలలా కాకుండా.. ఈమె అయినా వచ్చిన క్రేజ్‌ను సరిగ్గా వాడుకుంటారా లేదా చూడాలి.