- Telugu News Photo Gallery Cinema photos Rocking Rakesh And Jordar Sujatha Haldi function photos goes viral
Rakesh-Sujatha: కొత్త దంపతులు ఎంత క్యూట్‌గా ఉన్నారో?.. రాకింగ్ రాకేశ్- సుజాతల హల్దీ ఫంక్షన్ ఫొటోలు చూశారా?
జబర్దస్త్ ప్రేమ పక్షులు రాకింగ్ రాకేశ్- జోర్దార్ సుజాతలు మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. గత కొద్దికాలంగా ప్రేమలో ఉన్న వీరి వివాహం శుక్రవారం (ఫిబ్రవరి24) తిరుమల ఏడుకొండల వాడి సాక్షిగా అంగరంగ వైభవంగా జరిగింది.
Updated on: Feb 26, 2023 | 6:13 AM

జబర్దస్త్ ప్రేమ పక్షులు రాకింగ్ రాకేశ్- జోర్దార్ సుజాతలు మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. గత కొద్దికాలంగా ప్రేమలో ఉన్న వీరి వివాహం శుక్రవారం (ఫిబ్రవరి24) తిరుమల ఏడుకొండల వాడి సాక్షిగా అంగరంగ వైభవంగా జరిగింది.

ఇరు కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో రాకేశ్- సుజాతలు ఏడడుగులు నడించారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖా మంత్రి రోజా, సెల్వమణితో పాటు గెటప్ శ్రీను, యాంకర్ రవి పాటు పలువురు జబర్దస్త్ కమెడియన్స్ ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు.

ఇదిలా ఉంటే తాజాగా తమ హల్దీ వేడుకల ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు నూతన వధూవరులు. ఇందులో హల్దీ థీమ్‌లో రాకేశ్, సుజాత ఇద్దరూ పసుపు రంగు బట్టలు ధరించగా వెరైటీ స్టిల్స్‌తో కెమెరాలకు పోజులిచ్చారు.

'మీ అందరి ఆశీర్వాదాలతో ఒక్కటయ్యాం. ఈ ఆనందం చెప్పలేనిది, రాయలేనిది' అంటూ ఫోటోలు షేర్ చేశారు రాకేశ్- సుజాత. తమకు శుభాకాంక్షలు చెప్తున్న అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు

ప్రస్తుతం వీరి హల్దీ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. పలువురు బుల్లితెర ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు కొత్త దంపతులకు శుభాకాంక్షలు చెబుతున్నాయిరు.




