Rhea Chakraborty: మళ్ళీ సోషల్ మీడియాలో యాక్టివ్ అయిన సుశాంత్ మాజీ ప్రియురాలు
దివంగత నటుడు సుశాంత్ సింగ్ మాజీ ప్రియురాలు రియా చక్రవర్తి గుర్తుందా.. సుశాంత్ చనిపోయినప్పుడు ఈ ముద్దుగుమ్మ పేరు ఎక్కువగా వినిపించింది. సుశాంత్ మరణానికి ఆమె కారణం అంటూ వార్తలు కూడా వినిపించాయి.ఇక ఇప్పుడు ఈ చిన్నది ఆ పాత చేదు జ్ఞాపకాల నుంచి బయట పడిందని తెలుస్తోంది. రియా చేదు జ్ఞాపకాలన్నింటినీ మరచిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభించింది.