3 / 5
ఎవరికీ, ఏదీ ఉచితంగా అందదు. దానికి తగ్గ మూల్యాన్ని ఏదో రకంగా చెల్లిస్తూనే ఉండాలి అని అంటున్నారు స్టార్ డాటర్ సోనమ్ కపూర్. తన తండ్రి అనిల్ కపూర్ గురించి, ఆయన సంతూర్ లుక్స్ గురించి, చాలా విషయాలను చెప్పారు సోనమ్ కపూర్. ''మా నాన్న ఎక్స్ ట్రీమ్. ఆయన మద్యం సేవించరు. ధూమపానం జోలికి వెళ్లరు. ఆ మాటకొస్తే ఎంతో హెల్త్ కాన్షియస్‌గా ఉంటారు. బోనీ కపూర్ అయితే తినడానికి ఇష్టపడతారు. అప్పుడప్పుడూ తాగుతారు. సంజయ్‌కపూర్ వీరిద్దరికీ మధ్యస్తంగా ఉంటారు. కానీ మా నాన్నలాగా స్ట్రిక్ట్ గా ఎవరూ ఉండరు'' అని స్టేట్‌మెంట్ ఇచ్చారు సోనమ్ కపూర్. తన తండ్రి అంత స్ట్రిక్ట్ గా ఉండటానికి రీజన్, తన మదరేనని చెబుతున్నారు సోనమ్. తనకు కూడా పేరెంట్స్ నుంచి మంచి లక్షణాలు అలవాటయ్యాయన్నది సోనమ్ చెప్పే మాట.