
రణబీర్ కపూర్ హీరోగా భారీ రామాయణం తెరకెక్కనుంది. ఈ సినిమా ఎనౌన్స్‌మెంట్ అతి త్వరలో రానుంది. ఇప్పటికే రకరకాల వార్తలు వైరల్ అవుతున్నా... ఇంత వరకు చిత్రయూనిట్ నుంచి ఒక్క అఫీషియల్ ఎనౌన్స్‌మెంట్ కూడా రాలేదు. ఏప్రిల్ 17న శ్రీరామ నవమి సందర్భంగా ఈ ట్రయాలజీకి సంబంధించి అధికారిక ప్రకటన వస్తుందని భావిస్తున్నారు.

సాయి కుమార్, వినోద్ వర్మ, అనసూయ, శ్రీకాంత్ అయ్యంగార్ లీడ్ రోల్స్‌లో నటించిన థ్రిల్లర్ మూవీ అరి. పేపర్ బాయ్ ఫేమ్ జయ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా హిందీ రీమేక్ ప్లాన్స్‌ను రివీల్ చేశారు. అరి ప్రీవ్యూ చూసిన అభిషేక్ బచ్చన్ రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నట్టుగా వెల్లడించింది చిత్రయూనిట్.

టీజీ జ్ఞానవేల్ దర్శకత్వంలో రజినీకాంత్ హీరోగా నటిస్తున్న సినిమా వెట్టైయాన్. ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుంది. తాజాగా ఈ చిత్రం సెట్స్‌లో రానా దగ్గుబాటి జాయిన్ అయ్యారు. ఇందులో రజినీతో పాటు అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫాజిల్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రానా కూడా అత్యంత కీలక పాత్రలో నటిస్తున్నారు.

వంశీ తుమ్మల, హారిక బల్లా జంటగా వినయ్ రత్నం తెరకెక్కించిన షార్ట్ ఫిల్మ్ సాగు. 51 నిమిషాల నిడివి ఉన్న ఈ షార్ట్ ఫిల్మ్ తాజాగా ఓటిటికి వచ్చింది. వ్యవసాయం నేపథ్యంలో తెరకెక్కిన ఈ లఘు చిత్రాన్ని ఇప్పటికే పలు ఫిల్మ్ ఫెస్టివల్స్‌కు పంపించారు. సాగు చిత్రాన్ని నిహారిక కొణిదెల తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్‌పై విడుదల చేసారు.

సారా అలీ ఖాన్, సచిన్ ఖేడ్‌కర్, అభయ్ వర్మ కీలక పాత్రల్లో ఖన్నన్ అయ్యర్ తెరకెక్కిస్తున్న సినిమా ఏ వతన్ మేరే వతన్. స్వాతంత్య్ర ఉద్యమ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఇతర నిర్మాతలతో కలిసి కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. థియేటర్ కోసం కాకుండా ప్రత్యేకంగా ఓటిటిలోనే ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు మేకర్స్. మార్చి 21న రానుంది ఈ చిత్రం.