
యానిమల్ సినిమాతో మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సందీప్ రెడ్డి వంగా, నెక్ట్స్ మూవీకి రెడీ అవుతున్నారు. ముందే ఎనౌన్స్ చేసిన లైనప్‌ను పక్కన పెట్టి కొత్త ప్లాన్‌తో బరిలో దిగుతున్నారు. ప్రతీ సినిమాకు నెగెటివ్ హీట్‌ను ఫేస్ చేస్తున్న సందీప్, నెట్స్ సినిమా వాళ్ల ఊహలకు కూడా అందని రేంజ్‌లో ఉంటుందని ఊరిస్తున్నారు,

సందీప్ రెడ్డి వంగా సినిమాల విషయంలో కలెక్షన్స్‌కి, రివ్యూస్‌కి సంబంధమే ఉండటం లేదు. అర్జున్ రెడ్డి నుంచి యానిమల్ వరకు. రివ్యూయర్‌లు పెదవి విరిచినా... సినిమాలు మాత్రం సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ముఖ్యంగా కబీర్ సింగ్ విషయంలో నార్త్ మీడియాలో వచ్చిన కామెంట్స్ మీద సందీప్ కూడా సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు.

యానిమల్‌తో ఆడియన్స్ ముందుకు వచ్చిన సందీప్ బాక్సాఫీస్‌ను షేక్ చేశారు. 800 కోట్లకు పైగా వసూళ్లతో నయా రికార్డ్ సెట్ చేసింది ఈ మూవీ. వసూళ్ల పరంగా ఈ రేంజ్‌లో పెర్ఫామ్ చేస్తున్న సినిమా మీద క్రిటిక్స్ స్పందన నెగెటివ్‌గానే ఉంది. సోషల్ మీడియాలోనూ సందీప్ మీద ట్రోల్స్ ట్రెండ్ అవుతున్నాయి. అయితే అవన్నీ లైట్ అంటున్నారీ క్రేజీ డైరెక్టర్.

యానిమల్‌లో నెక్ట్స్ లెవల్ వైలెన్స్ చూపించిన సందీప్, యానిమల్ పార్క్ కోసం మరింత బ్లడ్డీ బ్యాక్‌డ్రాప్‌ను సిద్ధం చేస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా చెప్పిన డైరెక్టర్, తన నెక్ట్స్ మూవీ గురించి కామెంట్ చేయడానికి క్రిటిక్స్ భయపడతారేమో అంటూ సెటైర్ వేశారు.

యానిమల్ తరువాత ప్రభాస్ హీరోగా స్పిరిట్ సినిమా చేయాలనుకున్నారు సందీప్. కానీ ప్రభాస్ ఇప్పట్లో ఫ్రీ అయ్యే పరిస్థితి కనిపించకపోవటంతో యానిమల్ సీక్వెల్ మీద దృష్టి పెట్టారు. ఆల్రెడీ ఎనౌన్స్ అయిన యానిమల్ పార్క్‌ను త్వరలో సెట్స్ మీదకు తీసుకువచ్చేందుకు రెడీ అవుతున్నారు.