
యానిమల్‌తో మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేశారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. రా అండ్ బోల్డ్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ వైలెంట్ మూవీ ఇప్పుడు వసూళ్ల విషయంలోనే కాదు అవార్డుల వేటలోనూ దూసుకుపోతోంది.

తాజాగా ఓ ప్రస్టీజియస్ అవార్డ్స్ విషయంలో భారీగా నామినేషన్స్ దక్కించుకుంది యానిమల్. రణబీర్ కపూర్ హీరోగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ బోల్డ్ మూవీ యానిమల్. రీసెంట్‌గా ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది.

సాధారణంగా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఆదరించినప్పుడే ఏ సినిమా అయినా భారీ వసూళ్లు సాధిస్తుంది. కానీ ఏ సర్టిఫికేట్‌తో అది కూడా నెక్ట్స్ లెవల్ వైలెన్స్, బోల్డ్ లాంగ్వేజ్‌తో రూపొందిన యానిమల్ కూడా ఈ రేంజ్ వసూళ్లు సాధించటం ఇండస్ట్రీ జనాలకు కూడా షాక్ ఇచ్చింది.

యానిమల్ విషయంలో అంచనాలు తారుమారు అవ్వడం వెనుక కారణమేంటన్నది విశ్లేషిస్తున్నారు క్రిటిక్స్. ముఖ్యంగా ఈ సినిమాలో కంటెంట్ బోల్డ్‌గా ఉన్న ఫాదర్ అండ్ సన్ రిలేషన్, ఎమోషనల్ సీన్స్ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయ్యాయి.

వయలెన్స్ కాస్త గీత దాటినట్టుగా అనిపించినా... కొత్త తరహా టేకింగ్ కావటంతో ఆ సీన్స్‌ను కూడా ఆడియన్స్ బాగానే ఎంజాయ్ చేశారు. వసూళ్ల పరంగా నయా రికార్డ్స్ క్రియేట్ చేసిన యానిమల్, అవార్డుల విషయంలోనూ అదే జోరు చూపిస్తోంది.

తాజాగా ప్రకటించిన ఫిలింఫేర్ నామినేషన్స్ లిస్ట్‌లో టాప్‌లో నిలిచింది. ఏకంగా 19 కేటగిరీల్లో నామినేషన్స్ సాధించింది ఈ బోల్డ్ మూవీ. కేవలం నామినేషన్‌లో ఉండటమే కాదు..,

అవార్డులు సాధించటంలోనూ యానిమల్ ముందే ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. పోటిలో ఉన్న మిగతా సినిమాలతో పోలిస్తే టాక్ పరంగా, వసూళ్ల పరంగా యానిమల్‌కే ఎక్కువ అవార్డులు సాధించే ఛాన్స్ ఉందన్నది విశ్లేషకుల మాట.