- Telugu News Photo Gallery Cinema photos Rana Naidu 2 shooting to begin in January 2024, know what Venkatesh says about it
Rana Naidu 2: రానా నాయుడు 2 ఆన్ ది వే.. వెంకటేష్ ఏమంటున్నాడో తెలుసా ??
వెంకటేష్ కెరీర్ మొత్తం ఒక ఎత్తు అయితే.. కేవలం రానా నాయుడు మాత్రం మరో ఎత్తు. అసలు ఈ సిరీస్ విడుదలైనపుడు వచ్చిన రెస్పాన్స్ చూసి వెంకీకి కూడా మెంటల్ వచ్చేసింది. అసలు తను ఎందుకు ఈ కారెక్టర్ చేసాన్రా బాబూ అని ఓ సారి అన్నాడు.. అబ్బో ఆ కారెక్టర్‌లో ఇంత డెప్త్ ఉందా.. ఇంతగా రీచ్ అయిందా అని మరోసారి అన్నాడు. ఏదేమైనా రానా నాయుడులో వెంకటేష్ చేసిన నాగనాయుడు పాత్ర మాత్రం నెక్ట్స్ లెవల్ అంతే. ప్రయోగం చేసాడని పాజిటివ్‌గా తీసుకుంటే అలాగే ఉంటుంది.. అలా కాదు నెగిటివ్ అయితే నెగిటివ్ అంతే.
Praveen Vadla | Edited By: Phani CH
Updated on: Nov 22, 2023 | 7:28 PM

వెంకటేష్ కెరీర్ మొత్తం ఒక ఎత్తు అయితే.. కేవలం రానా నాయుడు మాత్రం మరో ఎత్తు. అసలు ఈ సిరీస్ విడుదలైనపుడు వచ్చిన రెస్పాన్స్ చూసి వెంకీకి కూడా మెంటల్ వచ్చేసింది. అసలు తను ఎందుకు ఈ కారెక్టర్ చేసాన్రా బాబూ అని ఓ సారి అన్నాడు.. అబ్బో ఆ కారెక్టర్‌లో ఇంత డెప్త్ ఉందా.. ఇంతగా రీచ్ అయిందా అని మరోసారి అన్నాడు. ఏదేమైనా రానా నాయుడులో వెంకటేష్ చేసిన నాగనాయుడు పాత్ర మాత్రం నెక్ట్స్ లెవల్ అంతే.

ప్రయోగం చేసాడని పాజిటివ్‌గా తీసుకుంటే అలాగే ఉంటుంది.. అలా కాదు నెగిటివ్ అయితే నెగిటివ్ అంతే. అసలు ఆయన ఆ పాత్ర చేయడానికి కారణమేంటి..? 35 ఏళ్ళ ఇమేజ్ పక్కనబెట్టి అంత రిస్క్ ఎందుకు తీసుకున్నారు...? వెంకటేష్ ఫ్యూచర్ ప్లాన్ మారబోతుందా..? బాలీవుడ్‌కు వెళ్తున్నారా.. సినిమాలు కాదని సిరీస్‌ల వైపు అడుగులేస్తున్నారా..? రానా నాయుడు ఎఫెక్ట్ వెంకీ కెరీర్‌పై ఏ మేర ఉండబోతుంది..? ఇకపై థియేటర్స్‌లో వెంకీ సినిమా చూడలేమా..? ఇలా ఎన్నో ప్రశ్నలు ఆయన అభిమానులను వేధించాయి.

ఏమైందిరా ఆ వెంకటేష్‌కు.. రానా నాయుడులో ఎందుకు అలా చేసాడు.. ఆయన ఇమేజ్ ఏంటి.. కథేంటి.. అందులో ఆ బూతులేంటి..? అంటూ రానా నాయుడు వెబ్ సిరీస్ చూసిన తర్వాత వెంకీ మామను చూసి సగటు సినీ ప్రేక్షకుడు కచ్చితంగా లోపల అనుకున్న మాట ఇదే. ఆయన హార్డ్ కోర్ ఫ్యాన్స్‌లో కాస్త అటూ ఇటూగా ఇదే చర్చ జరిగింది కూడా. 35 ఏళ్ళ ఫ్యామిలీ ఇమేజ్ పక్కనబెట్టి మరీ వెంకీ ఈ పాత్ర చేసారంటే.. ఆయనింకెంత ఆలోచించి ఉంటారనేది మరో వర్గం వాదన.

ఇలాంటి ఎన్నో ఫ్యామిలీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన వెంకటేష్.. రానా నాయుడుతో పూర్తిగా మేకోవర్ అయిపోయాడు. బోల్డ్ కంటెంట్ అని చెప్పారు.. భార్యాభర్తలు కూడా కలిసి చూడొద్దని హెచ్చరించారు కానీ.. ఎవరెన్ని చెప్పినా అక్కడున్నది వెంకటేష్ కాబట్టి సగటు ప్రేక్షకుడు కనీసం ఒక్కసారైనా ఎలా ఉందో తెలుసుకోడానికైనా చూడాలనుకుంటున్నారు. కానీ చూసాక మాత్రం వెంకీ వెబ్ సిరీస్ కోసం ఇంతలా దిగజారారేంటి అనే చర్చ మొదలైంది.

కథల ఎంపికలో కొన్నేళ్లుగా వెంకటేష్ అప్రోచ్ పూర్తిగా మారిపోయింది. ఒకప్పట్లా ఆయన కేవలం హీరోగానే చేస్తాను.. థియేటర్లలోనే వస్తాననే కండీషన్స్ పెట్టుకోవడం లేదు. పైగా హీరో కంటే ఎక్కువగా కారెక్టర్ రోల్స్ వైపు వస్తున్నారు. దృశ్యం, నారప్పల్లో ఏజ్డ్ పాత్రల్లో నటించారు. రానా నాయుడులో నలుగురు పిల్లల తండ్రిగా కనిపించారు. కిసీ కా భాయ్ కిసీ కా జాన్‌లోనూ సపోర్టింగ్ రోల్ చేసాడు వెంకటేష్. సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లు చేయాలని భావిస్తున్నాడు ఈయన.

ఇప్పుడు సైంధవ్ అంటూ వస్తున్నాడు. అందులో మళ్లీ తన గణేష్ టైప్ ఆఫ్ టిపికల్ మాస్ రోల్ చేస్తున్నాడు వెంకీ. అయితే ఎన్ని చేసినా.. తనకోసమే రాసే ఫ్యామిలీ కథలకు అందుబాటులో ఉంటానంటున్నాడు వెంకటేష్. అయితే థియెట్రికల్ రిలీజ్ అని పట్టు బట్టకుండా.. ఓటిటి సబ్జెక్టులపై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాడు.

ఇప్పుడు సైంధవ్ సాంగ్ లాంఛ్ కోసం ఓ కాలేజ్‌కు వెళ్లిన వెంకీ.. అక్కడ రానా నాయుడు సీజన్ 2 గురించి మాట్లాడాడు. జనవరి నుంచి షూటింగ్ మొదలవుతుందని.. ఫస్ట్ పార్ట్ చూసాక కుర్రాళ్లంతా వావ్ అంటే.. పెద్దోళ్లు మాత్రం ఏంట్రా నువ్వు ఇలా అయిపోయావ్ అన్నారని నవ్వుకున్నాడు. కచ్చితంగా ఈ సారి కూడా కారెక్టర్ కాస్త టిపికల్‌గా ఉంటుంది కానీ.. జాగ్రత్తలు అయితే గట్టిగానే తీసుకుంటున్నానని చెప్పాడు వెంకటేష్. అన్నట్లు సైంధవ్ వెంకటేష్‌కు 75వ సినిమా. శైలేష్ కొలను తెరకెక్కిస్తున్న ఈ సినిమా జనవరి 13న విడుదల కానుంది. దీని ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి.





























