
టాలీవుడ్ స్టార్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ అమ్మడు అందానికి ప్రతి ఒక్కరూ ఫిదా అవ్వాల్సిందే, అంతలా తన గ్లామర్‌తో ప్రతి ఒక్కరినీ కట్టి పడేస్తుంది. స్టైలిష్ డ్రెస్‌ల్లో గ్లామర్‌తో యూత్‌ను ఆగం చేస్తుంటుంది.

కెరటం సినిమాతో తెలుగు వెండితెరకు పరిచయమైన ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. ఈ అమ్మడు మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత సందీప్ కిషన్ సరసన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ మూవీలో నటించి, మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఈ మూవీ తర్వాత ఈ ముద్దుగుమ్మకు లక్కు కలిసి వచ్చిందనే చెప్పాలి.

ఈ మూవీ తర్వాత ఈ అమ్మడు వరసగా అవకాశాలు అందుకుంది. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ కొట్టేసింది. సరైనోడు, ధృవ, కిక్ 2, నాన్నకు ప్రేమతో ఇలా చాలా సినిమాల్లో నటించి మెప్పించింది. ఇండస్ట్రీలోకి ఎంట్రి ఇచ్చిన చాలా కొద్ది సమయంలోనే టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా తన హవా కొనసాగించింది.

ఇక తెలుగులో అవకాశాలు తగ్గడంతో ఈ బ్యూటీ బాలీవుడ్ చెక్కేసింది. అక్కడ వరసగా ఆఫర్స్ అందుకుంటూ ఓ వెలుగు వెలిగింది. ముఖ్యంగా బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నాని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇక వివాహం తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పకుండా, ఓ వైపు మూవీస్, మరో వైపు బిజినెస్‌లు చూసుకుంటూ గడిపేస్తుంది.

ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ అమ్మడు తాజాగా, గోల్డ్ కలర్ డ్రెస్‌లో, స్టైలిష్ లుక్‌లో కనిపించి, తన అంద చందాలతో అందరినీ ఆకట్టుకుంటుంది,