ఇంతకు మించి ఏం కావాలి బ్రదర్ అని లోకేష్ కనగరాజ్‌కి తలైవర్ ఫ్యాన్స్ అందరూ హగ్గులూ, లవ్ సింబల్సూ పంపిస్తున్నారు. తలైవర్‌ని ఎలా చూడాలనుకున్నామో, అచ్చం అలాగే చూపించావ్.. కడుపు నిండిపోయింది. ఇక నీ పని నువ్వు భేషుగ్గా చేసుకో.. మేం డిస్టర్బ్ చేయం... సినిమా ఎలా ఉంటుందో అర్థమైపోయింది అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇంతకీ మీరు చూశారా తలైవర్ 171 టీజర్‌ని...
ఫుల్ బ్లాక్ అండ్ గోల్డ్ థీమ్... ఎక్కడ చూసినా చీకటి, మధ్యలో బంగారు వర్ణం... చూడగానే ఏదో చెప్పబోతున్నారన్న ఇంటెన్సిటీని క్రియేట్ చేసింది ప్రతి ఫ్రేమ్. తలైవర్ నటిస్తున్న 171వ సినిమాకు కూలీ అనే పేరును ఫిక్స్ చేశారు లోకేష్ కనగరా.జ్.
తలైవర్ గోల్డ్ స్మగ్లర్‌గా నటిస్తారనే టాక్ ఎప్పటి నుంచో ఉంది. అయితే బంగారాన్ని స్మగ్లింగ్ చేసే సామ్రాజ్యంలోకి కూలీగా ఎంట్రీ ఇచ్చిన రజనీకాంత్‌ని చూపించారు లోకేష్. మూడు నిమిషాలకు పైగా సాగిన టీజర్‌లో అద్దిరిపోయే యాక్షన్, ఆకట్టుకునే డైలాగులను చూపించారు లోకేష్.
ప్రతి ఫ్రేమూ ఇలా ఉంటే చాలు.. ఇంతకు మించి మేం ఇంకేం అడగబోం అంటూ లోకేష్‌ని విష్ చేస్తున్నారు ఫ్యాన్స్. అయితే ఈ సినిమాలో లోకేష్ యూనివర్శ్‌లోని కేరక్టర్లు ఉంటాయా, ఉండవా అనే చర్చ గట్టిగా వినిపిస్తోంది.
అసలు అలాంటి ఊహే లేదని ఇంతకు ముందే లోకేష్ కానగరాజ్ క్లారిటీ ఇచ్చారు. అయినా, తాజాగా వచ్చిన కూలీ టీజర్‌లో ఉన్న షాట్లు చూస్తే, మళ్లీ ఎక్కడో హోప్ కలుగుతోందని అంటున్నారు నెటిజన్లు.