- Telugu News Photo Gallery Cinema photos Pushpa actor Daali Dhananjay and Dhanyatha get engaged in traditional ceremony, See photos
Daali Dhananjay: డాక్టరమ్మతో ఉంగరాలు మార్చుకున్న పుష్ఫ నటుడు.. జాలిరెడ్డి గ్రాండ్ ఎంగేజ్‌మెంట్ ఫొటోస్ ఇదిగో
అల్లు అర్జున్ నటించిన పుష్ఫ సినిమాలో జాలి రెడ్డిగా తెలుగు ఆడియెన్స్ కు బాగా దగ్గరయ్యాడు డాలీ ధనుంజయ. ప్రస్తుతం సత్యదేవ్ తో కలిసి జీబ్రా సినిమాలోనూ నటిస్తున్నాడీ ట్యాలెంటెడ్ యాక్టర్.
Updated on: Nov 17, 2024 | 5:05 PM

కన్నడ స్టార్ హీరో, పుష్ప ఫేమ్ డాలీ ధనుంజయ త్వరలో తన జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టనున్నాడు. డాక్టర్ ధన్యతతో కలిసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనున్నాడు.

ఆదివారం (నవంబర్ 17) డాలీ ధనుంజయ, ధన్యతల నిశ్చితార్థం గ్రాండ్ గా జరిగింది. ఇరు కుటుంబ పెద్దలు, స్నేహితుల సమక్షంలో ఉంగరాలు మార్చుకున్నారు కాబోయే దంపతులు.

అరసీకెరెలోని కాలేనహళ్లిలోని డాలీ ధనుంజయ ఇంట్లో ఈ నిశ్చితార్థం వేడుక సింపుల్‌గా జరిగింది. ఈ సందర్భంగా ధనుంజయ తన కాబోయే భార్య ధన్యత చేతి వేలికి ఉంగరం తొడిగాడు.

ఆ తర్వాత ధన్యత కూడా డాలీ చేతి వేలికి ఉంగరం కూడా తొడిగింది. ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతున్నాయి.

కాగా ఈ వేడుకలోనే పెళ్లి ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. దీని ప్రకారం ఫిబ్రవరి 16న మైసూరులో డాలీ ధనుంజయ, ధన్యతల వివాహం జరగనుంది.

డాలీ ధనంజయ్ ప్రస్తుతం నటుడిగా, నిర్మాతగా, మాటల రచయితగా ఇండస్ట్రీలో రాణిస్తున్నాడు. ఇక ధన్యత విషయానికి వస్తే వృత్తిరీత్యా డాక్టర్.




